ETV Bharat / state

TEMPLE LANDS: కబ్జా కోరల్లో దేవుని మాన్యం.. ఆక్రమణలే కానీ రక్షణ శూన్యం.! - temple lands are illegally occupiedin palamur district

దేవాదాయశాఖకు 18వేల ఎకరాల భూములుంటే.. అందులో 11వేల ఎకరాలు ఆక్రమణలే. ఇదీ పాలమూరు జిల్లాలో(PALAMUR DISTRICT) దేవాలయ భూముల(TEMPLE LANDS) దుస్థితి. చట్టవిరుద్ధమని తెలిసినా కొందరు దేవాలయ భూములను అమ్మేస్తారు. ఇంకొందరు ఆక్రమించేస్తారు. మరికొందరు అనుభవిస్తారు కానీ పైసా కూడా చెల్లించరు. ఇవన్నీ ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారాలే. కానీ దేవాదాయశాఖ నుంచి చర్యలూ ఉండవు.. అక్రమమని తెలిసినా రెవెన్యూ, పురపాలక, రిజిస్ట్రేషన్ శాఖలు అనుమతులు ఇచ్చేస్తాయి. శాఖల మధ్య సమన్వయలోపం, కొరవడిన పర్యవేక్షణ, అధికారుల అలసత్వం వెరసి.. ఉమ్మడి జిల్లాలో దేవాదాయశాఖ భూములు ఆక్రమణలకు గురవుతున్న తీరుపై 'ఈటీవీ భారత్​' ప్రత్యేక కథనం.

TEMPLE LANDS
కబ్జా కోరల్లో దేవుని మాన్యం
author img

By

Published : Sep 4, 2021, 1:35 PM IST

Updated : Sep 4, 2021, 3:19 PM IST

దేవుని భూములంటే(TEMPLE LANDS) చాలు వాటిని ఆక్రమించడం, అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం, దేవాదాయశాఖకు ఎలాంటి రుసుములు చెల్లించకుండానే అనుభవించడం పరిపాటిగా మారింది. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా(MAHABUBNAGAR DISTRICT)లో ఏళ్లుగా వేల ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమవుతూ వస్తున్నాయి. పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆలయ భూముల కబ్జాల బాగోతాలు కొనసాగుతున్నాయి. మహబూబ్​నగర్ జిల్లాలో జడ్చర్ల వెంకటేశ్వర స్వామి ఆలయం పేరిట 102 ఎకరాల భూములుండగా ప్రస్తుతం ఆ భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. వాస్తవానికి ఇవి సర్వీసు ఇనామ్ భూములు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో స్వామి వారికి ధూపదీప నైవేద్యాలు, ఏటా ఉత్సవాలు నిర్వహించాలే తప్ప వీటిని అమ్మడానికి, కొనడానికి వీలులేదు. కానీ కొంతమంది వీటిపై ఓఆర్సీ(అక్యూపెన్సీ రైట్ సర్టిఫికెట్) తెచ్చుకుని ఆ భూముల్లో జోరుగా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. ఈ భూములపై 143కు పైగా రిజిస్ట్రేషన్లు సైతం అయ్యాయి. ప్రస్తుతం ఈ భూముల్లో వెంచర్లు వెలిశాయి. కొత్త భవనాలు నిర్మితమయ్యాయి. దేవాదాయశాఖ భూముల్లో ఇలాంటి వాటికి అసలు అవకాశమే లేదు. అయినా.. పురపాలక, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు తమ ఇష్టానుసారం అనుమతులిచ్చాయి. ఫలితం ఆలయం పేరిట ఇవాళ భూములే లేని దుస్థితి నెలకొంది.

కబ్జా కోరల్లో దేవుని మాన్యం.. ఆక్రమణలే కానీ రక్షణ శూన్యం.!

జడ్చర్లలోని దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. 140 ఎకరాలు ఉన్న భూమి ప్రస్తుతం 4 ఎకరాలే మిగిలింది. దేవాదాయ శాఖ భూముల్లో స్థానిక ప్రజాప్రతినిధులు వెంచర్లు వేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. -సత్తయ్య, జడ్చర్ల వాసి

ఉమ్మడి జిల్లాలో 18వేల ఎకరాలకు పైగా దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి. జడ్చర్ల పరిధిలో 63 ఎకరాలు ఉంటే 4 నుంచి 5 ఎకరాలు మాత్రమే ఖాళీగా ఉంది. మిగిలిన భూమి అంతా ఆక్రమణలోనే ఉంది. త్వరలోనే సర్వే చేయించి మిగిలిన భూముల్లో బోర్డులు పెట్టిస్తాం. దేవుని మాన్యాలను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. -శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్​, పాలమూరు జిల్లా

గ్రామమే వెలిసింది

వనపర్తి జిల్లాలో వనపర్తి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ పేరిట 24 ఆలయాలకు కలుపుకుని సుమారు 1284 ఎకరాల భూములున్నాయి. వీటిలో 852 ఎకరాల భూములు సర్వీస్ ఇనాం పేరిట, ఇతరుల పేర్ల మీద, 543 ఎకరాలు దేవాలయాల పేరుతో పట్టాభూములున్నాయి. ప్రస్తుతం దేవాలయాలకు ఎలాంటి ఆదాయం లేకుండా ఈ భూములన్నీ ఇతరుల ఆక్రమణల్లోకి వెళ్లిపోయాయి. కొందరు ఈ భూములతో స్థిరాస్తి వ్యాపారం చేస్తుండగా, దేవాలయానికి ఎలాంటి రుసులు చెల్లించకుండానే కొందరు వాటిని అనుభవిస్తున్నారు. నాగసానిపల్లి, రంగాపూర్, పాలెం, కనిమెట్ట లాంటి గ్రామాల్లో ఇటీవలే ఇతరుల అధీనంలో ఉన్న 125 ఎకరాలను దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. మిగిలిన చోట్ల అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో 90ఎకరాలు దేవాదాయశాఖ పేరు మీద ఉండగా.. ఆ భూముల్లో ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మరికల్ మండలం పల్లెగడ్డలోని దేవాలయ భూముల్లో ఏకంగా ఓ గ్రామమే నిర్మాణమైంది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవుని మాన్యాల్లో కబ్జాలు కొనసాగుతున్నాయి.

దేవాలయ భూములపై కొందరు ఓఆర్సీ తెచ్చుకుని 20 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ అండదండలతోనే ఇదంతా సాధ్యమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని దేవుని భూములను కాపాడాలి. -నడిమింటి శ్రీనివాస్​, జడ్చర్ల నివాసి

రాజకీయ అండదండలు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో దేవాదాయశాఖకు సంబంధించి మొత్తం భూములు 18,957 ఎకరాలుంటే.. అందులో ఆక్రమణల్లో ఉన్నవి సుమారు 11వేల ఎకరాలు. వాటిలో 10వేల ఎకరాల్లో ఎలాంటి వివాదాలు లేకుండా అన్యాక్రాంతమై ఉండగా.. 643 ఎకరాలు మాత్రం వివాదాల్లో ఉన్నాయి. 3,300 ఎకరాలు అర్చకుల పేరు మీద ఇనాం భూములుగా ఉండగా, సుమారు 3వేల ఎకరాలను లీజుకు ఇచ్చారు. అయితే మిగిలిన భూములను సైతం చట్టంలోని లొసుగులు, అధికారుల అండదండలు, రాజకీయ పలుకుబడితో దక్కించుకునేందుకు జిల్లాలో జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు శాఖ పరంగా చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయశాఖ అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అక్రమాలకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు. ముఖ్యంగా రెవెన్యూ, పురపాలక, రిజిస్ట్రేషన్, దేవాదాయ శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారుతోంది.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి శాఖల మధ్య సమన్వయంతో ఆక్రమణలు తొలగించడంతో పాటు ఉన్న దేవుని మాన్యాలను కాపాడాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: అవసాన దశలో ఆయువు పోసే నేస్తం... 'స్పర్శ్ హాస్పిస్​'కు శ్రీకారం

Last Updated : Sep 4, 2021, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.