మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి కురుస్తున్న వానకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రామయ్యబౌలి, శివశక్తినగర్, ఎర్రమన్నుగుట్ట, కుర్హిశెట్టి కాలనీలు నీటమునిగాయి. జిల్లా కేంద్రంలోని చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. నాలాలు పొంగి పొర్లడం వల్ల ఇళ్లలోకి నీరు చేరాయి. నీళ్లు మళ్లించేందుకు దారిలేకపోవడం వల్ల పలు ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
వాన పడుతున్న ప్రతిసారి తమ పరిస్థితి ఇలాగే ఉంటోందని కాలనీవాసులు వాపోయారు. నీళ్లు ఇళ్లలోకి చేరినప్పుడు కాలనీలో పర్యటించి ఓదార్చే వారే తప్ప.. శాశ్వత పరిష్కారం చూపేవారు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
- ఇదీ చూడండి : 'రాష్ట్రానికి 10 లక్షల టన్నుల యూరియా కేటాయింపు'