ETV Bharat / state

'దేశాభివృద్ధి కోసమే ఫెడరల్​ ఫ్రంట్' - kcr

కాంగ్రెస్, భాజపాలు దేశాభివృద్ధికి చేసిందేమి లేదని హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్రలోని ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

ప్రచారంలో మహమూద్ అలీ
author img

By

Published : Apr 9, 2019, 11:31 AM IST

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్రలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ప్రచారం నిర్వహించారు. ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్, భాజపాలు మైనార్టీలను ఓటు బ్యాంకు లానే చూశారు తప్పా... అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తెరాస మాత్రం అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి నిరుపేదలకు అందించిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 16 సీట్లతో కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పుతారని ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి జరగలాంటే ఫెడరల్​ ఫ్రంట్ ఏర్పడాల్సిందేనని మహమూద్ అలీ అభిప్రాయపడ్డారు.

ప్రచారంలో మహమూద్ అలీ

ఇవీ చూడండి: "చివరి క్షణం వరకు ప్రచారం హోరెత్తాలి"

Intro:Tg_Mbnr_14_08_Home_Manthri_At_Devarakadra_Avb_G3
రాష్ట్ర హోంశాఖ మంత్రి mahmud ali మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర లో ముస్లిం ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొని ప్రసంగించారు దేశంలో నిజమైన సెక్యులరిస్టు గా మతాలకు అతీతంగా పేదలకు సంక్షేమం పథకాలను అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు. దేశాన్ని మోసం చేసిన కాంగ్రెస్ భాజపా లు రూపాయి బిల్లకు ఇరవై వైపుల ఉన్న బొమ్మలే తప్ప దేశ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. పద్నాలుగేళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కు దేశభక్తి ప్రధానిగా అయ్యే అర్హతలు ఉన్నాయని అన్నారు

Body:దేవరకద్ర లో ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న హోం శాఖ మంత్రి mahmud ali తోటి ముస్లింలతో కలిసి రెహమాన్ సబ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తో కలసి ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు
దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా గా తెలంగాణలో ముస్లింలకు పెద్దపీట వేస్తూ ఉప ముఖ్యమంత్రిగా , హోం మంత్రిగా సాధారణ ముస్లింలను చేసి తన సెక్యులరిజాన్ని నిరూపించుకున్నారు. ఇప్పటివరకు పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కేవలం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు గా నియమించి నిధులు ఇవ్వకుండానే ఓటుబ్యాంకుగా మైనార్టీ నాయకులను వాడుకున్నారనీ ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి నిరుపేదలకు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందన్నారు.
సెక్యులర్ రిస్ట్ భావాలతో ఉన్న ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి జిందగీ లో మద్దతు ఇవ్వ బోరాన్నారు.. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాడు అవసరమైతే దేశ ప్రధానిగా తెలంగాణతో సమానంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి పధం లో నడిపిస్తాడని హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ అన్నారు . ప్రతి ఒక ముస్లిం లను కారు గుర్తుకు ఓటు వేసి మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న మన్నే శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు.

Conclusion:దేవరకద్ర లో హోం శాఖ మంత్రి mahmud ali ముస్లిం ఆత్మీయం సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర తో కలిసి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.