మహబూబ్‌నగర్ జిల్లాలో గత నాలుగు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లాక్డౌన్ ఆంక్షలు సండలించినప్పటికి.. భానుడి ప్రతాపానికి ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. బయట వేడిగాలులకు తాళలేక ఇళ్లకే ఎక్కువ మంది పరిమితం అవుతున్నారు. రోడ్లన్నీ ఎండ తీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులకు మినహా.. జనాలు బయటకు రావడం లేదు.
గత రెండు, మూడు రోజులుగా జిల్లాలో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఆదివారం రికార్డు స్థాయిలో మహబూబ్‌నగర్ జిల్లాలో 44.7 డిగ్రీలు నమోదుకాగా.. నారాయణపేట జిల్లాలో 44.5 డిగ్రీలు నమోదైంది. ఇక వనపర్తి జిల్లాలో అత్యదికంగా 44.3 డిగ్రీలు... నాగర్‌కర్నూల్ జిల్లాలో 43.5 డిగ్రీలు, గద్వాల జిల్లాలో 43 డిగ్రీలుగా నమోదైంది.