ETV Bharat / state

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి

author img

By

Published : Jul 18, 2020, 8:15 PM IST

రాష్ట్రం పచ్చదనంతో ఉట్టి పడేలా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ప్రేమావతి అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు.

haritha haram program at court area in mahabubnagar
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ప్రేమావతి

హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ప్రేమావతి తెలిపారు. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

జిల్లా కోర్టు సముదాయంలో న్యాయ సేవసదన్, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. అదనపు జిల్లా జడ్జి జస్టిస్​ రఘురాం, కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్​ వసంత్‌తో పాటు ఇతర న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు మొక్కలు నాటారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.