ETV Bharat / state

GROUND WATER: అడుగంటుతోన్న భూగర్భ జలాలు.. అష్టకష్టాలు పడుతున్న రైతన్నలు - mahabubnagar district

GROUND WATER LEVEL: అసలే వేసవి కాలం.. ఆపై మండుతోన్న ఎండలు.. పూర్తిగా అడుగంటిపోయిన భూగర్భ జలాలు. పూర్తిగా బోరుబావుల‌పై ఆధార‌ప‌డి పంట‌లు సాగు చేస్తున్న రైతులు.. వాటిని కాపాడుకునేందుకు అన్నదాతలు పడే కష్టం అంతాఇంతా కాదు. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఏప్రిల్‌ మొదటి వారంలో మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు మీటర్ల మేర నీటి మట్టం పడిపోయింది. కొన్ని బోరుబావులు ఆగిఆగి నీరు పోస్తుంటే.. మరికొన్ని ఎండిపోయాయి. దీనికి తోడు అనధికార విద్యుత్‌ కోతలు మొదలవటంతో కళ్ల ముందే పంటలు ఎండుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. చేసేది లేక ఎండిన చేలల్లో పశువులను మేపుతున్నారు.

అడుగంటుతోన్న భూగర్భ జలాలు.. అష్టకష్టాలు పడుతున్న రైతన్నలు

author img

By

Published : Apr 14, 2022, 5:19 AM IST

Updated : Apr 14, 2022, 6:43 AM IST

GROUND WATER LEVEL: గత రెండేళ్లుగా సమృద్ధిగా వర్షాలతో వానాకాలంకే కాదు.. యాసంగికీ నీళ్లు సరిపోతాయని భావించి వరి వేసిన పాలమూరు రైతులకు కన్నీళ్లే మిగిలాయి. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ఉన్నఫలంగా అనధికార విద్యుత్‌ కోతలు మొదలవ్వడంతో పంటలు ఎండు ముఖం పడుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. బోరుబావుల నుంచి ఆగిఆగి నీరు వస్తుండటంతో పొలం పారటం లేదని వాపోతున్నారు.

అడుగంటుతోన్న భూగర్భ జలాలు.. అష్టకష్టాలు పడుతున్న రైతన్నలు

మరింత పడిపోయే అవకాశం..

అధిక మొత్తంలో వరి సాగు చేయడంతో నీటి వాడకం పెరిగిందని.. అందువల్లే భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు. రెండు నెలల వ్యవధిలోనే 2 మీటర్ల మేర భూగర్భజలాలు పడిపోయినట్లు వివరించారు. నీటి వాడకం ఇదే విధంగా కొనసాగితే ఏప్రిల్‌, మేలో మరింత పడిపోయే అవకాశం ఉంటుందని జిల్లా భూగర్భ జల అధికారి రాజేంద్ర కుమార్‌ తెలిపారు. ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.

జాగ్రత్తగా వాడటమే మార్గం..

గతేడాది కన్నా ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్నా.. రోజురోజుకూ పడిపోతున్న నీటి మట్టం పరిస్థితిని గమనిస్తే కర్షకులను ఆందోళన కలిగించేలా ఉంది. నెల రోజుల్లో 2 మీటర్లకు పైగా నీటి మట్టం పడిపోవటం ప్రమాదకరమని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో బోరుబావుల నుంచి నీటిని వృథా చేయకుండా రైతుల్లో నీటి వినియోగంపై అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవీ చూడండి:

Govt On Paddy Procurement: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కసరత్తు షురూ

గ్రామాన్నే పాఠశాలగా మార్చేసిన మాస్టారు!

Last Updated : Apr 14, 2022, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.