మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంతో పాటు కౌకుంట్ల గ్రామంలో ఏరువాక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఆవరణ సమీపంలో ఏర్పాటుచేసిన ఉత్సవాలను తిలకించేందుకు వందల సంఖ్యలో పట్టణవాసులు తరలివచ్చారు. రైతులు ఏరువాక తాడును తెంచేందుకు ఎడ్లబండ్లపై పోటీపడి పడ్డారు. చివరకు చర్నాకోలతో తాడును తెంచి ఘనంగా పండుగ నిర్వహించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
ఇవీ చూడండి: 'కెప్టెన్ మెదడు లేనోడు... అందుకే పాక్ ఓడింది'