ETV Bharat / state

డబ్బులు వస్తాయంటూ న్యూడ్ ఫొటోలు తీస్తున్నారు.. ఈ ఉచ్చులో పడొద్దు.. - Fraudsters Collects Nude Photos from Women

Fraudsters Collects Nude Photos from Women: సైబర్ మోసాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. కొత్త కొత్త ఎత్తులతో నేరగాళ్లు అమాయకులను నిండా ముంచుతున్నారు. నేటి ఆధునిక కాలంలో స్మార్ట్​ఫోన్ వినియోగం ఎంత పెరిగిందో.. అదే స్థాయిలో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన లేని వాళ్లను ఆసరాగా చేసుకుంటూ కొత్త మార్గాల్లో గాలం వేస్తున్నారు. మొన్నటి వరకు వాట్సాప్ నగ్న వీడియో కాలింగ్, మెసేజ్​ల ద్వారా బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. తాజాగా మహబూబ్​నగర్​లో మరో నయా మోసానికి తెరలేపారు.

Fraudsters Collects Nude Videos from Women

author img

By

Published : Feb 22, 2023, 9:35 PM IST

Fraudsters Collects Nude Photos from Women: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జోగులాంబ గద్వాల జిల్లాలో నగ్నవీడియో కాల్స్ వ్యవహారం మరవకముందే.. మరో కొత్త తరహా మోసం మహబూబ్​నగర్​లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ఇప్పటి వరకు 'ఈ-​మెయిల్‌', మెసేజ్‌ల ద్వారా బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నారు. మొన్నటి వరకు నగ్న వీడియో కాల్స్, ఛాటింగ్​లతో రెచ్చిపోయిన మోసగాళ్లు తాజాగా మరో నయా దందాకు తెరలేపారు.

పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు/యువతులను లక్ష్యంగా చేసుకొని మోసగాళ్లు ఈ దందాకు పాల్పడ్డారు. ఇంతకీ ఆ కొత్త దందా ఏమిటంటే ముందుగా తాము ఎంచుకున్న మహిళతో మాయమాటలు కలుపుతారు. ఎదో రకంగా ఆమెను ఒప్పుకునేలా కళ్లబొల్లి మాటలు చెప్పి నగ్న చిత్రాలు సేకరిస్తారు. ఆ నగ్న ఫొటోలు హైదరాబాద్​లోని తమ గురువుకి పంపితే డబ్బులు వస్తాయంటూ నమ్మబలుకుతారు. ఆ తర్వాత ఎవరికి దొరకకుండా మాయమైపోతున్నారు. కొద్దిరోజుల క్రితం మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో జరిగిన వ్యవహారంతో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ నగ్న ఫొటోల వ్యవహారం ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం పాత బజారుకు చెందిన ఓ మహిళ ఇంటికి ఈ నెల 18న అదే బజారుకు చెందిన ఓ యువకుడు రాత్రి 10 గంటల సమయంలో వెళ్లాడు. ఆమెకు మోసపూరిత మాటలు చెప్పి ఆమె నగ్న ఫొటోలు తీసుకున్నాడు. అలాగే ఈ న్యూడ్ ఫొటోలు హైదరాబాద్​లోని ఓ గురువుకి పంపితే డబ్బులు వస్తాయని మాయమాటలు చెప్పి ఆమె శరీరాకృతికి సంబంధించిన 50కి పైగా నగ్న చిత్రాలు సేకరించాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన మహిళ ఈ నెల 20న పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఒక్క మహిళ మాత్రమే బాధితురాలిగా ఉందా? నిందితుల ఉచ్చులో ఇంకా ఎందరు మహిళలు పడ్డారు ? నగ్న దృశ్యాలు తీయడం వెనక నిందితుల అసలు ఉద్దేశం ఏమిటి ? హైదరాబాద్​లో ఉన్న గురువు ఎవరు? అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉందని జడ్చర్ల ఎస్సై వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.