పెళ్లి కాలేదన్న మనస్థాపంతో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువతులు ఆత్మహత్యకు యత్నించారు. గ్రామంలో వెంకటయ్య దంపతులకు ఆరుగురు కుమార్తెలు. 5వ కుమార్తె రెండు రోజులుగా కనిపించకుండా పోయింది. ఆచూకి కోసం వెతకగా... పరిచయమున్న వ్యక్తితో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. ఇక తమకు పెళ్లిళ్లు కావన్న మనస్థాపంతో పురుగుల మందు తాగి మూకుమ్మడిగా ఆత్మహత్యాయత్నాతికి పాల్పడ్డారు. విషయం గమనించి స్థానికులు జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: అమ్మ జ్ఞాపకాలతో... అనాథల ఆకలి తీరుస్తూ...