నిరవధిక దీక్షలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 'సేవ్ ఆర్టీసీ' పేరుతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకుని... తద్వారా ఆర్థిక సాయం పొందుతూ నిరవధిక దీక్ష కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.
మహబూబ్నగర్లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ప్రతి ఒక్కరు కనీసం వంద రూపాయలు ఇచ్చే విధంగ కోరడమే కాకుండా... వారి మద్దతును కూడగట్టుకోవాలని సూచించారు. మహబూబ్నగర్ డిపో పరిధిలోని ఆర్టీసీ కార్మికులకు బియ్యం పంపిణీ చేయాల్సిందిగా ఐకాస నేతలకు రూ.లక్ష విరాళం అందించారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన దీక్షలు 41 రోజులకు చేరుకోగా... కార్మికులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు.
ఇదీ చూడండి: 'పేదల సొంతింటి కల నెరవేర్చడమే.. ప్రభుత్వ లక్ష్యం'