విద్యుత్ ఛార్జీల విషయంలో సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని భాజపా నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్లాబ్‌తో సంబంధం లేకుండా, గతేడాది బిల్లులతో సంబంధం లేకుండా ఇష్టానుసారం బిల్లులు వేశారని ఆరోపించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్‌తో కలిసి విద్యుత్ భవన్ ఎదుట భాజపా ఆధ్వర్యంలో కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.
విద్యుత్ ఛార్జీల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ప్రజలు గళమెత్తాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఖరే ఈ అధిక ఛార్జిలకు కారణమని మాజీ ఎంపీ ఆరోపించారు. కరెంటు బిల్లుల విషయంలో తగిన న్యాయం జరిగే వరకు భాజపా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల