ETV Bharat / state

'టీవీ ఉంది.. కేబుల్ రావడం లేదు.. అన్నీ ఉంటే కరెంట్ ఉండదు'

టీవీ ఉంది... కేబుల్ కనెక్షన్ లేదు. కేబుల్ కనెక్షన్ ఉంది.. టీ-శాట్ ఛానల్ రావడం లేదు. టీవీ, కేబుల్ రెండూ ఉన్నాయి.. కానీ పాఠం వచ్చే సమయానికి కరెంటు లేదు. స్మార్ట్ ఫోన్ ఉంది... డాటా లేదు. స్మార్ట్ ఫోన్, డాటా రెండూ ఉన్నాయి. కానీ సిగ్నల్ లేదు. మారుమూల గ్రామాల్లో డిజిటల్‌ తరగతుల విషయంలో విద్యార్థులు తొలిరోజు ఎదుర్కొన్న సమస్యలివి. సర్కారీ బళ్లలో చదివే విద్యార్థులకు డిజిటల్‌ విద్య అందించేందుకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసినా... క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు తప్పలేదు. పేదరికం, అవగాహన లేమి, వసతుల కొరత, కరోనా భయం ఇలా అనేక కారణాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను డిజిటల్‌ విద్యకు దూరం చేస్తున్నాయి.

Field level difficulties in listening to online classes
డిజిటల్‌ పాఠాలు వినడంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు
author img

By

Published : Sep 2, 2020, 11:01 AM IST

Updated : Sep 2, 2020, 11:13 AM IST

డిజిటల్‌ పాఠాలు వినడంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు

మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల గ్రామ విద్యార్ధిని లావణ్య పరిగిలో బాలికల వసతి గృహంలో ఉంటూ అక్కడి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. నెలరోజుల క్రితం పుస్తకాలు కూడా తెచ్చుకుంది. కానీ మంగళవారం ప్రారంభమైన డిజిటల్‌ తరగతులకు ఆమె దూరమైంది. టీవీ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు, దగ్గర్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్ధులూ లేరు. టీవీ, ఫోన్ కొనె స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో పాఠాలకు ఆమె దూరమైంది. పగిడ్యాల గ్రామంలోనే పదో తరగతి చదువుతున్న కృష్ణది సైతం అదే పరిస్థితి.

అదే ఊళ్లోని మరో విద్యార్ధి టీవీలో పాఠాలు వింటున్నా చదువులో వెనకబడిన విద్యార్థి కావడంతో చెప్పే పాఠాలు అర్థం కావడం లేదు. ఇక పగిడ్యాలలో టీవీలున్న వాళ్లకు కేబుల్ కనెక్షన్లు లేవు. ఇంటర్‌నెట్ సిగ్నల్, విద్యుత్ అంతరాయంతో మారుమూల గ్రామాల్లోని విద్యార్ధులకు డిజిటల్‌ తరగతులు దూరమవుతున్నాయి.

వర్షాలు బాగా కురిసి వ్యవసాయం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని సైతం పొలం పనులకు తీసుకువెళ్తున్నారు. టీవీలు లేని వాళ్లు తోటి విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి పాఠాలు వినాలన్నది సర్కారు ఆలోచన. కరోనా ప్రభావం కారణంగా ఇతరులను ఇళ్లలోకి రానివ్వడానికి కొందరు అంగీకరించడం లేదు.

డిజిటల్‌ విద్య నిరుపేద కుటుంబాలకు భారంగా మారుతోంది. టీవీ, స్మార్ట్ ఫోన్ లేకుంటే వేలు వెచ్చించి వాటిని కొనుగోలు చేయాలి. నేరుగా ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తేనే సర్కారు బళ్లల్లో ఉత్తీర్ణత శాతం అంతంత మాత్రం. విద్యార్థిపై నియంత్రణలేని డిజిటల్‌ విద్యలో చదువు అబ్బుతుందా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు లక్షా 83 వేల మంది విద్యార్థులు డిజిటల్‌ పాఠాలు విన్నట్లు విద్యాశాఖ చెబుతోంది. తొలిరోజు 70 నుంచి 80 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాల్సిందే. బడి ఈడు పిల్లల్లో ఒక్క విద్యార్థికి చదువు దూరమైనా... అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ విద్య అందరికీ చేరువయ్యేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: మరోమారు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం

Last Updated : Sep 2, 2020, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.