ETV Bharat / state

రైస్​మిల్​ ఎదుట అన్నదాతల ఆందోళన - దేవరకద్రలో రైతుల ఆందోళన

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని మా లక్ష్మీ రైస్​మిల్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. పలువురు వివిధ కొనుగోలు కేంద్రాల నుంచి సరైన అనుమతి పత్రాలు లేకుండానే ధాన్యాన్ని నేరుగా రైస్​మిల్లుకు తీసుకురావడం, వరుస క్రమంలో ఉన్న వాహనాలను దాటుకుని ఇష్టారీతిన ముందుకు దూసుకుపోతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పడంతో శాంతించారు.

రైతుల ఆందోళన
రైతుల ఆందోళన
author img

By

Published : May 11, 2021, 2:57 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని మా లక్ష్మీ రైస్​మిల్ ఎదుట రైతుల మధ్య గొడవ జరిగింది. పలువురు వివిధ కొనుగోలు కేంద్రాల నుంచి సరైన అనుమతి పత్రాలు లేకుండానే నేరుగా ధాన్నాన్ని రైస్​మిల్లుకు తీసుకురావడం.. లైన్లలో ఉన్నవారిని కాదని ముందుకు దూసుకుపోవడం వల్ల గొడవ ప్రారంభమైంది. గొడవను గమనించిన మిల్లర్ల యజమానులు.. ధాన్యం అన్​లోడ్​ చేయడాన్ని కాసేపు నిలిపివేశారు.

ఫలితంగా రైస్​మిల్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై భగవంతు గౌడు... రైతులను శాంతింపజేశారు. వరుస క్రమంలో ఉన్న ట్రాక్టర్లకు టోకెన్లను అందజేసి.. ధాన్యం సేకరించాలని మిల్లర్లకు సూచించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి కొనుగోలు కేంద్రాల అనుమతి పత్రాలు ఉంటేనే.. రైస్ మిల్లులకు ధాన్యాన్ని తీసుకురావాలని రైతులకు సూచించారు.

ఇదీ చదవండి: రెండో దశలో వేగంగా పల్లెలను చుట్టుముడుతున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.