ETV Bharat / state

ఆ భూముల్లో ప్రభుత్వ వెంచర్లు!.. జీవనోపాధి కోల్పోతామని అన్నదాతల ఆవేదన - telangana news

Farmers Oppose Land Pooling: జీవనోపాధి కోసం తాత, ముత్తాతలకిచ్చిన భూములవి. వాటిని నమ్ముకునే ఆ కుటుంబాలు బతుకీడుస్తున్నాయి. అలాంటి భూముల్ని స్థిరాస్తి వ్యాపారం కోసం ప్రభుత్వం సేకరించడాన్ని మహబూబ్​నగర్ జిల్లా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎకరాకు 400 గజాలిస్తామని చెబుతున్నా.. జీవనోపాధి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. భూములు బలవంతంగా లాక్కొనే ప్రయత్నం చేయెుద్దని వేడుకుంటున్నారు.

ఆ భూముల్లో ప్రభుత్వ వెంచర్లు!.. జీవనోపాధి కోల్పోతామని అన్నదాతల ఆవేదన
author img

By

Published : Mar 23, 2022, 7:36 PM IST

ఆ భూముల్లో ప్రభుత్వ వెంచర్లు!.. జీవనోపాధి కోల్పోతామని అన్నదాతల ఆవేదన

Farmers Oppose Land Pooling: ప్రభుత్వ భూముల్ని స్థిరాస్తి వెంచర్లుగా అభివృద్ధి చేసి అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కారు భావిస్తోంది. ఇటీవల మహబూబ్​నగర్‌లోని రాజీవ్ స్వగృహ ఇళ్ల స్థలాలను వేలంలో విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందింది. ప్రస్తుతం హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భూముల్లో ఇదే తరహా వ్యాపారానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జాతీయ రహదారి వెంట గతంలో రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములను సేకరించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. బాలనగర్, రాజాపూర్, జడ్చర్ల, అడ్డాకుల మండలాల్లో స్థలాలను గుర్తించినట్లు సమాచారం. మాచారంలో 36, చిట్టెబోయినపల్లిలో 77 ఎకరాలు, నందిగామలో 50 ఎకరాలు, మోతీగణపూర్‌లోనూ భూములను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారులు తమతో సంప్రదింపులు జరిపారని... తాము వ్యతిరేకించామని రైతులు వెల్లడించారు.

మా భూములు మాకే ఉండాలి..

ఈ పొలాన్ని 1953లో ప్రభుత్వం మాకిచ్చింది. ఇప్పుడేమో అధికారులు వచ్చి ఈ భూమిని మాకు ఇచ్చేయండి. ఎకరాకు 400 నుంచి 500 గజాలను అభివృద్ధి చేసి ఇస్తామంటున్నారు. ఈ పద్ధతి మాకేం ఇష్టం లేదు. మా భూములు మాకే ఉండాలి. అడిగితే మీరు ఆవేశంతో మాట్లాడుతున్నారని అంటున్నారు. మేము ఆవేశంతో మాట్లాడట్లేదు.. బాధతో మాట్లాడుతున్నాం. -రైతు

మేమెలా బతకాలి..

కర్వెన జలాశయానికి 2 కిలోమీటర్ల దూరంలోనే పేదప్రజల 77 ఎకరాల భూములున్నాయి. ఈ భూములు మీరు తీసుకుంటే మా బతుకులెట్లా. మాకు ఉన్న ఆదెరువే ఈ పొలాలు. ఇవి తీసుకుంటే మేమెలా బతకాలి. -రైతు

అన్నదాతల ఆవేదన

గత ప్రభుత్వాల హయాంలో బడుగు, బలహీన వర్గాల జీవోనపాధి కోసమే ప్రభుత్వం భూముల్ని కేటాయించింది. తాతల కాలం నుంచి వాటిని ఆ కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. వ్యవసాయ యోగ్యం కాని ప్రదేశాల్లో భూములిచ్చినా.. లక్షలు వెచ్చించి రైతులు అభివృద్ధి చేసుకున్నారు. తోటలు, సీజన్‌ల వారీగా పంటలు వేసుకుని పూట గడుతున్నారు. కర్వెన, ఉదండపూర్ జలాశయం పనులు జోరుగా జరుగుతుండటంతో పొలాలు సస్యశ్యాలం అవుతాయని భావించారు. కానీ, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భూములు తీసుకుంటామని చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 400గజాలు మాత్రమే ఇస్తామని చెప్పినట్లు వెల్లడించారు.

గట్టిగా వ్యతిరేకిస్తున్న రైతులు

ఇటీవల మహబూబ్‌నగర్‌లో వేలం నిర్వహిస్తే గజం సగటున 20 వేలు పలికింది. 400 గజాలు కేటాయిస్తే రైతుకు 80లక్షల విలువ జేసే స్థలం దక్కుతుంది. అమ్ముకునే హక్కుఉంది కాబట్టి రైతులకు మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారుల ప్రయత్నాల్ని మాత్రం రైతులు గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. ఇంటి స్థలం విలువైనదే అయినా జీవనోపాధి మాటేంటనేది వారి ప్రశ్న. ప్రభుత్వం భూమికి బదులు సాగుకు యోగ్యమైన భూమి, నష్టపరిహారం సహా పునరావాసం కల్పించాలనే డిమాండ్లు సైతం వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.