ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల టోల్ గేట్ వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఇప్పటికే తెగుళ్లతో తీవ్రంగా నష్ట పోయామన్నారు. తాలును సాకుగా చూపి కొనుగోలు చేయడం లేదని వాపోయారు. వరి కోత మిషన్ తోనే కోత కోసి.. తూర్పారా పట్టాలని అధికారులు చెబుతున్నారన్నారు. కోతలు కోసి నెల రోజులుగా రోడ్డుపైనే ధాన్యం పోసుకొని ఉన్నామని రైతులు ఆవేదన చెందారు.
ప్రభుత్వం చెప్తేనే సన్న రకాలను సాగు చేశామన్నారు. బయట అమ్ముదామంటే వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు వాపోయారు. సన్న రకం సాగుతో పూర్తిగా నష్టపోయామని, ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: భగీరథ నీటి సరఫరా పునరుద్ధరణ : కలెక్టర్ వెంకట్రావు