ETV Bharat / state

Vegetable Cultivation: ఒక్క ఎకరంలో నాలుగు పంటలు.. నెలకు రూ. లక్ష ఆదాయం - farmer earns profits by vegetable cultivation in mahabubnagar

Farmer Earns Profits by Vegetable Cultivation: కూరగాయల సాగుతో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువ రైతు. పది ఎకరాల ఉన్న వారి కంటే ఒక ఎకరంలోనే నాలుగు రకాల పంటలు సాగు చేస్తూ.. నెలకు లక్ష రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నారు. కూలీల అవసరం లేకుండా భార్యతో కలిసి సాగు చేస్తూ... ఖర్చులు తగ్గించుకుని లాభాల మార్గంలో ప్రయాణిస్తున్నారు.

income in vegetables cultivation
కూరగాయల సాగుతో లాభాలు
author img

By

Published : Mar 17, 2022, 1:36 PM IST

Farmer Earns Profits by Vegetable Cultivation: మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం గుడిమల్కాపూర్‌ గ్రామానికి చెందిన రైతు వెంకట్​ రెడ్డి.. కొత్త పంథాలో పయనిస్తూ వ్యవసాయంలో లాభాలు అందుకుంటున్నారు. ఆయన విజయసూత్రం.. మిగిలిన రైతుల్లా వాణిజ్య పంటల జోలికి వెళ్లలేదు. కేవలం ఎకరం భూమిలోనే నిరంతరం ఆదాయం ఉండే.. కాకర, బీర, సొర, వంకాయ, పుచ్చకాయ, స్వీట్​ కార్న్​ ఇలా రకరకాల కూరగాయల సాగు చేపట్టారు. పందిళ్లు వేయకుండా తీగలను కట్టి.. తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తున్నారు. మడి విడిచి మడిలో.. కాకర, బీర, పుచ్చ సాగు చేపట్టారు. ఒక పంట కోత పూర్తయ్యేసరికి మరో పంట చేతికి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టారు. దీంతో నిత్యం ఆదాయం పొందుతున్నారు.

ఒక ఎకరంలోనే 4 రకాల పంటలు సాగు చేస్తూ లాభాల ఆర్జన

కూలీల అవసరం లేకుండా

Income by Vegetable Cultivation: యూట్యూబ్‌లో పంట ఎంపికతో పాటు.. సాగులో మెళకువలు పాటిస్తూ ఖర్చులు గణనీయంగా తగ్గించుకుంటున్నారు. కలుపు ఖర్చులు తగ్గించుకునేందుకు వీలుగా మల్చింగ్‌ షీట్స్‌ ఉపయోగిస్తున్నాడు. కూలీల అవసరం లేకుండా భార్య సహకారంతో... రైతు ఒక్కడే విత్తు విత్తినప్పటి నుంచి పండించిన కూరగాయలను.. మహబూబ్‌నగర్‌ రైతు బజార్‌లో స్వయంగా విక్రయిస్తూ... లాభాలు ఆర్జిస్తున్నారు.

పంట దెబ్బతిన్నా.. తక్కువ నష్టం

వరిపై పెట్టుబడి తిరిగి రావాలంటే కనీసం 120 నుంచి 150 రోజులు సమయం పడుతుందని వెంకట్​ రెడ్డి పేర్కొన్నారు. అదే కూరగాయలు సాగు చేస్తే 45 రోజుల నుంచే దిగుబడుల మొదలవుతాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతిన్నా.. తక్కువ నష్టంతో బయటపడవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

"నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. వరి సాగు జోలికి వెళ్లను. ఎందుకంటే పంట చేతికొచ్చే వరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టమే మిగులుతుంది. అందుకే కూరగాయల సాగు ఎంచుకున్నాను. ఎకరా పొలంలో ఒకేసారి మూడు, నాలుగు రకాల కూరగాయలు సాగు చేస్తాను. నీటిని సద్వినియోగం చేసుకునేందుకు డ్రిప్స్​ వినియోగిస్తాను. 45 రోజులకు పంట చేతికొస్తుంది. ఒక పంట అయిపోయాక మరొకటి వేస్తాను. దీంతో ప్రతి నెలా లక్ష వరకూ ఆదాయం వస్తుంది. కూలీల ఖర్చు లేదు కాబట్టి.. లాభం బాగానే మిగులుతుంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దెబ్బతిన్నా.. తక్కువ ఖర్చుల కారణంగా నష్టం పెద్దగా ఉండదు." -వెంకట్​ రెడ్డి, రైతు, గుడిమల్కాపూర్​

రాయితీ అందించాలి

వానాకాలంలో పది ఎకరాలు వరిసాగు చేసిన రైతులకు దీటుగా... ఎకరా పొలంలోనే కూరగాయల సాగులో లాభాలు ఆర్జిస్తున్న వెంకట్‌ రెడ్డి.. మరెందరో రైతులకు స్ఫూర్తిదాయకం. మెట్ట ప్రాంత రైతులతో పాటు సన్నకారు రైతులు కూరగాయలు సాగులో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల సాగు ప్రొత్సహించేందుకు రైతులకు ప్రభుత్వం నుంచి రాయితీ అందించాలి. కలుపు మొక్కలు పెరగకుండా వాడే మల్చింగ్‌ షీట్లు, కలుపు మొక్కలను తీసే యంత్రాలను రాయితీపై అందించాలని కర్షకులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: Water Man Of India on GO 111 Withdrawal : 'కేసీఆర్ ప్రకటనతో నా గుండె చెరువయింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.