తాత్కాలిక ఉద్యోగులపై దాడి:
డిపో నుంచి బైటకు వస్తున్న బస్సును కార్మికులు అడ్డుకున్నారు. బస్సులో ఉన్న తాత్కాలిక డ్రైవర్, కండక్టరపై దాడికి దిగారు. బస్సును ఆపేసిన డ్రైవర్, కండక్టర్ బస్సులోనే నిలబడిపోయారు. దాడి చేస్తారేమోనని భయాందోళనకు గురయ్యారు. వారికి పోలీసులు రక్షణగా నిలిచి.. డిపో లోపలికి పంపించారు. ఆర్టీసీ కార్మికులు బస్సు డ్రైవర్ చాంబర్ వద్ద వైర్లను లాగేశారు. టైర్లలో గాలితీసేందుకు ప్రయత్నించారు. బస్సు ముందు పడుకుని ముందుకు కదలకుండా అడ్డుకున్నారు.
నినాదాలు:
అప్పటికే విధుల్లోకి చేరిన ఆర్టీసీ కార్మికుల ఫెక్సీలపై చెప్పులతో దాడి చేశారు. విధుల్లో చేరిన కార్మికులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకూ ఆందోళన ఆగదని కార్మికులు స్పష్టం చేశారు. కార్మికులను శాంతింపజేసిన పోలీసులు ప్రయాణ ప్రాంగణం బైటకు పంపారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
ఇదీ చదవండిః ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు