ETV Bharat / state

'కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా భాజపా వైపే చూస్తున్నారు' - తెలంగాణ వార్తలు

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా... అటక్​ నుంచి కటక్​ దాకా అందరూ భాజపా వైపే చూస్తున్నారని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాల కంపెనీలన్నీ భారత్​ వైపు చూస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం వ్యాపారవేత్తలకు అవకాశం కల్పించకుండా... సొంత లాభాల కోసం పాలన సాగిస్తోందని ఆయన ఆరోపించారు.

MP Jitender Reddy.
కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా భాజపా వైపే చూస్తున్నారు
author img

By

Published : Jan 20, 2021, 5:27 AM IST

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా అటక్​ నుంచి కటక్​ దాకా అందరూ భాజపా వైపే చూస్తున్నారని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాల కంపెనీలన్నీ భారత్​ వైపుచూస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం వ్యాపారవేత్తలకు అవకాశం కల్పించకుండా... సొంత లాభాల కోసం పాలన సాగిస్తోందని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు.

రాష్ట్రంలో పార్టీని పటిష్ఠ పరిచేందుకు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బూత్ వారిగా ఇంఛార్జిలను నియమించి... మండల, జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలో రానున్న ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌లు, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలలో భాజపా విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర సంపదతో ఉత్తర తెలంగాణలోనే అభివృద్ధి జరుగుతుందని... దక్షిణ తెలంగాణపై తెరాాస ప్రభుత్వం వివక్ష చూపుతోందని శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రాయలసీమ ఎత్తిపోతల పథకంతో నీళ్లు తరలించుకుపోతుంటే.. కేసీఆర్ మాత్రం ఫాం హౌస్‌కు పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కొవిడ్‌ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున యువతకు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్‌ చేశారు. రానున్న ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కామాంధుడైన కన్నతండ్రి.. మూడేళ్లుగా కుమార్తెల పై..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.