పట్టణీకరణ వల్ల నశిస్తున్న అడవులను తిరిగి పెంపొందించడానికి అందరూ మొక్కలు నాటాలని మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోరారు. హరితహారంలో భాగంగా శుక్రవారం కొడంగల్ పట్టణంలోని మార్కెట్ యార్డులో ఆయన మొక్కలు నాటారు.
అటవీ సంపద లేకపోతే ప్రజలకు స్వచ్ఛమైన గాలి లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి... వాటిని సంరక్షించాలి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఉషారాణితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.