మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని అయ్యప్ప కొండపై నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతికి చెందిన వెంకటేశ్వరశర్మ గురుస్వామి వేద, మంత్రోచ్ఛారణల మధ్య అయ్యప్ప ఆలయంలో ఏకశిలా పదునెట్టాంబడి పూజను ఘనంగా నిర్వహించారు. స్వామివారి భక్తిగీతాలు ఆలపిస్తూ పడిపూజ భక్తుల కళ్లకు కట్టేలా వివరించారు. మణికంఠస్వామిని కొలిచిన వారికి సకలసౌభాగ్యాలు కలుగుతాయని స్వామిజీ ప్రబోధించారు.
తనవంతు సాయం అందిస్తా: మంత్రి
అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక మందిరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పాలమూరుకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మంత్రి స్పష్టం చేశారు.