ETV Bharat / state

సంక్షోభంలోనూ సడలని స్ఫూర్తి... మహిళా సంఘాల ఆదర్శం - mahaboob nagar district news

కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో ఆర్థిక మూలాలపై తీవ్ర ప్రభావం పడటంతో పనులు లేక ఇబ్బంది నెలకొంది. అనేక ప్రైవేట్‌, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, ఫైనాన్స్‌ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోగా రుణాల వసూలు గగనంగా మారింది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. క్రమశిక్షణ, సమష్టితత్వం, సంఘాల నిబంధనలకు కట్టుబడి క్రమం తప్పకుండా తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లిస్తున్నారు. పట్టణ మహిళల రుణాల చెల్లింపు 97 శాతానికి పైగా ఉండగా 93 శాతం రుణాల తిరిగి చెల్లింపుతో వారికి దీటుగా పల్లె మహిళలు కూడా నిలుస్తుండటం విశేషం.

During the Corona crisis, members of women's groups regularly borrowed installments in mahaboobnagar district
సంక్షోభంలోనూ సడలని స్ఫూర్తి... మహిళా సంఘాల ఆదర్శం
author img

By

Published : Sep 3, 2020, 9:29 AM IST

డీఆర్‌డీఏ-ఐకేపీ ఆధ్వర్యంలో నడిచే స్వయం సహాయక సంఘాలు, పురపాలికల్లో మెప్మా ఆధ్వర్యంలో నడిచే ఎస్‌హెచ్‌జీల్లో ఉన్న సభ్యులు ప్రతి నెలా సక్రమంగా కిస్తులను చెల్లిస్తున్నారు. కరోనా కష్టకాలంలో మహిళా సంఘాల సభ్యులు క్రమం తప్పకుండా రుణాల కిస్తులు కడుతున్నారు.

ప్రతి నెల సమావేశాల్లో సమీక్షించుకుంటూ కట్టాల్సిన రుణాలను చెల్లిస్తుండటం విశేషం. అందుకోసం సంఘాల సభ్యులు పూర్తిగా సహకరిస్తున్నారు. కరోనా సమయంలో డీఆర్‌డీఏ - ఐకేపీ నుంచి బ్యాంకు లింకేజీ నుంచి ఇచ్చిన రుణాల్లో రూ.7.98 కోట్లు వసూలయ్యాయి. రుణాలు పొందిన వారిలో 6.77 శాతం మంది రుణాలను కట్టడం లేదు. మెప్మా ఆధ్వర్యంలో ఇచ్చిన రుణాల్లో ఇప్పటి వరకు రూ.1.62 కోట్లు కిస్తుల రూపంలో చెల్లించారు. రుణాలు తీసుకున్న వారిలో 2.26 శాతం మాత్రమే కిస్తులను సక్రమంగా చెల్లించడం లేదు.

అడ్డాకులలో మహిళా సభ్యుల సమావేశం

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లావ్యాప్తగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ రుణాలకు 32,279 సంఘాలు అర్హత సాధించాయి. అందులో 3,87,348 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వారికి వచ్చే ఏడాది మార్చి నెల చివరి నాటికి రూ.799.13కోట్ల రుణాలను అందించాలి. అందులో ఈ ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో 3,874 సంఘాలకు రూ.87.58 కోట్లు చెల్లించారు. అందులో 93.23 శాతం చొప్పున రుణాలు తీసుకున్న మహిళలు తిరిగి ప్రతి నెలా కిస్తుల రూపంలో డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తున్నారు.

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా పట్టణాల్లో పేద మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను అందిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 1,679 ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ. 59.06 కోట్లు ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్ధరించారు. అందులో ఇప్పటి వరకు 309 సంఘాలకు రూ.14.68 కోట్లు ఇచ్చారు.

ఇచ్చిన రుణాల్లో రూ.1.62 కోట్లు చెల్లించారు. అంటే తీసుకున్నవారు రుణాలు చెల్లించిన వారిలో 97.74 శాతం ఉన్నారు. ప్రతి నెల కిస్తులను క్రమం తప్పకుండా పట్టణ మహిళలు చెల్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూర్‌, మక్తల్‌, నారాయణపేట, వనపర్తి కొత్తకోట, ఆత్మకూరు, గద్వాల, అలంపూరు, అయిజ, రాజోలి, వడ్డేపల్లి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, అచ్చంపేట, కల్వకుర్తి, తదితర వాటిలో దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి ఈ రుణాలను అందిస్తున్నారు. వారంతా తిరిగి చెల్లిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా మహిళా సమాఖ్యలో దిశానిర్థేశం చేస్తున్న డీఆర్‌డీవో వెంకట్‌రెడ్డి

నిరంతర పర్యవేక్షణ..

- వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీవో, మహబూబ్‌నగర్‌

స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చిన బ్యాంకు లింకేజీ రుణాలను తిరిగి ప్రతి నెల వసూలు చేసేలా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. ప్రతి నెల సమావేశాలను నిర్వహించి డబ్బులను వసూలు చేసేలా ఏపీఎంలు, సీసీలు, సంఘాల అధ్యక్షురాళ్లకు సలహాలు, సూచనలను అందిస్తున్నాం. అందులో భాగంగానే డీఆర్‌డీఏ- ఐకేపీతో పాటు మెప్మా రుణాలు కూడా రికవరీ అవుతున్నాయి. విశేషమేమిటంటే కరోనా కాలంలో కూడా మహిళలు చక్కగా రుణాలను చెల్లించడానికి ముందుకు వస్తున్నారు.

జిల్లాా ఎస్​హెచ్​జీలు

రుణాలు

(రూ.కోట్లలో)

తీసుకున్న వారు
ఎస్​హెచ్​జీలురూ.కోట్లు
నాగర్​కర్నూల్​8,663212.5085228.92
మహబూబ్​నగర్​7,947190.271,09821.79
వనపర్తి5,505147.7686615.09
నారాయణపేట5,410138.2168714.27
జోగులాంబ గద్వాల 4,754110.393717.51
మొత్తం32,279799.133,87487.58

ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లపై కరోనా ప్రభావం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.