మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పెద్ద చెరువులో పక్షుల సందడి నెలకొంది. చలి తీవ్రత తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుండడంతో వివిధ ప్రాంతాల నుంచి పక్షులు వస్తున్నాయి. అడవి బాతులు నీటిలో తేలియాడుతూ, కొంగలు గాలిలో విహరిస్తూ అటుగా వెళ్లేవారికి కనువిందు చేస్తున్నాయి. ఆ దృశ్యాలను 'ఈటీవీ భారత్' కెమెరా క్లిక్ మనిపించింది.
ఇదీ చదవండి: యాదాద్రిలో సత్యనారాయణ వ్రత మండపం పనులు ముమ్మరం