ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరుగా మారిన తాగునీరు - KLEAKAGE

తాగునీటి కోసం వేల గొంతుకలు వేచి చూస్తుంటే... అధికారుల నిర్లక్ష్యంతో తాగునీరును సాగునీరుగా మార్చారు కొందరు. వృథాగా పోతున్నాయన్న సాకుతో తాగునీటితో తమ పొలాలను పండించుకుంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరుగా మారిన తాగునీరు
author img

By

Published : Apr 26, 2019, 10:24 PM IST

పాలమూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం కోయిల్ సాగర్ జలాశయం నుంచి తాగునీటి సరఫరా చేపట్టింది. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రం ధర్మాపూర్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఆ పైపులైను స్లూయిస్ వాల్వ్ దగ్గర లీకేజి అవుతోంది. 5 అంగుళాల పైపు... 24 గంటల పాటు నీరు పోస్తూనే ఉంటుంది. ఇలా చాలా రోజులుగా జరుగుతుండటంతో కొందరు తమ పొలాలకు మళ్లించుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. 15 ఎకరాల పంటను సాగుచేసేంత నీరు వృథా అవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏడాది కాలంగా నీరు వృథాగా పోతున్న విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని స్థానికులు చెబుతున్నారు. ఇది నిజంగానే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా? లేక ఈ గ్రామస్థులే కావాలని నీటిపైపును లీక్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారి వెంట ఉన్న పైపులైను లీకేజీలను కట్టడి చేసిన అధికారులు దీనిని ఇలా ఎందుకు వదిలేశారనే విషయం అంతుచిక్కడం లేదు.

అధికారుల నిర్లక్ష్యంతో సాగునీరుగా మారిన తాగునీరు

ఇవీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

Intro:TG_Mbnr_01_26_Drinking_Water_For_Cultivation_PKG _r_C4

( ) వేల గొంతుకలు తడపాల్సిన తాగునీరు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా... వృధాగా పోతుంది. ఈ జలాన్ని కొందరు సాగుకు సద్వినియోగం చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు. నీరు నిర్లక్ష్యమై పొంగుతుంటే... పైరు పచ్చగా పండుతోంది.

Body:పాలమూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం కోయిల్ సాగర్ జలాశయం నుంచి తాగునీటి సరఫరా చేపట్టింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ధర్మాపూర్ గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై ఆ పైపులైను స్లూయిస్ వాల్వ్ దగ్గర లీకేజి కావడంతో గత కొన్ని నెలలుగా నీరు వృధాగా పోతుంది. వృధా నీళ్లు బయటకి విడుదల చేసే 5 అంగుళాల పైపు వద్ద 24 గంటల పాటు పోతున్న నీటిని కొందరు తమ పొలాలకు మళ్లించి ఏకంగా రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. వృధాగా పోతున్న నీటితోనే వరి పంటలను సాగు చేస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు ఈ నీటితో ఏకంగా ఎనిమిది నుంచి 15 ఎకరాల వరకు వరి పంటలను సాగు చేస్తున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Conclusion:ఏడాది కాలం నుంచి నీరు వృధాగా పోతున్న విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ఇదే రహదారి వెంట ఉన్న పైపులైను లీకేజిలను కట్టడి చేసిన అధికారులు ఇక్కడ మాత్రం అలాగే వదిలేశారని అంటున్నారు......byte
బైట్
రంగన్న, గ్రామస్తుడు, ధర్మాపూర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.