ETV Bharat / state

నోటీసు ఇవ్వకుండా ఎలా సస్పెండ్​ చేస్తారు: డోకూరి - pavan

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్​ఛార్జి, టీపీసీసీ సభ్యుడు డోకూరి పవన్ కుమార్​ రెడ్డిపై  కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే పార్టీలోని కొందరు నాయకులు కావాలనే  తనను సస్పెండ్​ చేయించారని ఆయన ఆరోపించారు.

నోటీసు ఇవ్వకుండా ఎలా సస్పెండ్​ చేస్తారు
author img

By

Published : Mar 24, 2019, 8:04 PM IST

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంతమంది స్వార్థపరుల చేతిలో కొట్టుమిట్టాడుతోందని మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర కాంగ్రెస్​ పార్టీ ఇన్​ఛార్జి డోకూరి పవన్​కుమార్​రెడ్డి ఆరోపించారు. డీకే అరుణ వర్గీయులను పార్టీలో ఉంచకూడదనే ఉద్దేశంతోనే తనను సస్పెండ్​ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకొని నేరుగా పత్రికా ప్రకటన విడుదల చేయడం బాధాకరమన్నారు.

నోటీసు ఇవ్వకుండా ఎలా సస్పెండ్​ చేస్తారు

ఇదీ చదవండి:హైదరాబాద్​ను రెండవ రాజధాని చెయ్యాలి: రేవంత్

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంతమంది స్వార్థపరుల చేతిలో కొట్టుమిట్టాడుతోందని మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర కాంగ్రెస్​ పార్టీ ఇన్​ఛార్జి డోకూరి పవన్​కుమార్​రెడ్డి ఆరోపించారు. డీకే అరుణ వర్గీయులను పార్టీలో ఉంచకూడదనే ఉద్దేశంతోనే తనను సస్పెండ్​ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకొని నేరుగా పత్రికా ప్రకటన విడుదల చేయడం బాధాకరమన్నారు.

నోటీసు ఇవ్వకుండా ఎలా సస్పెండ్​ చేస్తారు

ఇదీ చదవండి:హైదరాబాద్​ను రెండవ రాజధాని చెయ్యాలి: రేవంత్

Intro:Tg_Mbnr_08_24_Dokoor_Pavan_PressMeet_Avb_G3 మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కాంగ్రెస్ ఎస్ పార్టీ ఇంచార్జ్, టిపిసిసి సభ్యులు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ చేయడంతో ఆ
యన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు విలేకరుల సమావేశం నిర్వహించారు


Body:ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంతమంది స్వార్థపరుల చేతిలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాకు చెందిన జైపాల్ రెడ్డి తన మనుగడను కాపాడుకునేందుకు తన వెంట ఉండే అనుచరులతో డీకే అరుణ వర్గీయులుగా ముద్ర పడిన వ్యక్తుల పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే పార్టీలోని కొందరు నాయకులు కావాలనే ఆగమేఘాల మీద తనను పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారని ఆరోపించారు . కేవలం భాజపా పార్టీలో చేరేందుకు వెళ్లిన డీకే అరుణ వెంట ఒక అభిమానిగా వెళ్లాను .తప్ప పార్టీలో చేరడానికి కాదని పత్రికా ముఖంగా చెప్పుకున్నాను. కాంగ్రెస్ నాయకులు కొందరు డీకే అరుణ వర్గీయులకు పార్టీలో లో చోటు కల్పించకూడదు అనే ఉద్దేశంతోనే నోటీసులు లేకుండానే సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకొని ని నేరుగా గా పత్రికా ప్రకటన చేయడం బాధ కరంగా ఉందన్నారు . పదకొండేళ్లుగా పార్టీ కోసం క్రియాశీలక కార్యకర్తగా నాయకునిగా సేవలందించిన తననే ఇలా చేస్తే పార్టీని నమ్ముకున్న చిన్న స్థాయి కార్యకర్తల కు ఇలాంటి గౌరవం ఉందో తెలుస్తుందన్నారు . ఇక అనుచరులతో ముఖ్య నాయకులతో అభిమానులతో కలసి వారి తో చర్చించి ఏ పార్టీలో చేరాలనే ది రెండు రోజులు ప్రకటిస్తానని తెలిపారు.


Conclusion:దేవరకద్ర నియోజకవర్గంలో dokur పవన్ కుమార్ రెడ్డి తదుపరి కార్యాచరణ ప్రణాళికను అనుచరులతో చర్చించి రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.