కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి డోలాయమానంగా మారిందని భాజపా నేత మాజీ మంత్రి డీకే. అరుణ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హస్తం పార్టీ గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని.. నేతలు భాజపాలో చేరాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని భాజాపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీకే.అరుణ పాల్గొన్నారు. రాష్ట్రంలో తెరాస ఆరాచకాలకు ప్రత్నమ్యాయంగా మారాల్సిన అవసరం ఉందని.. అందుకు భాజపాతో కలిసి రావాలని సూచించారు. పురపాలిక ఎన్నికల సందర్భంగా వార్డుల విభజన జరుగుతుందని.. అధికారులు పూర్తి స్థాయిలో పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీచూడండి: అమ్మా బైలెల్లినాదో..తల్లీ బైలెల్లినాదో..!