మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్లలో మైనర్ బాలికను అపహరించిన కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రమేయమున్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వాపోయారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి గట్టి సందేశం ఇచ్చేలా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులకు రెండు మూడు నెలల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రెమా రాజేశ్వరిని కోరారు. అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతున్నా.. సర్కారు పట్టించుకోకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో తెరాస విజయం