ETV Bharat / state

'పోలీసుల నిత్య జీవితంలో క్రీడలు భాగం కావాలి' - మహబూబ్​నగర్​లో జిల్లా స్థాయి పోలీసు క్రీడలు

పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని కొనసాగించడానికి ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని మహబూబ్​నగర్​ ఎస్పీ రాజేశ్వరి అన్నారు. ఈ మేరకు పోలీస్​ హెడ్​ క్వార్టర్స్​ కవాతు మైదానంలో జిల్లా స్థాయి క్రీడలను ఆమె ప్రారంభించారు. పోలీసులు నిత్యజీవితంలో క్రీడలను అలవరచుకోవాలని కోరారు.

district level sports
'పోలీసుల నిత్య జీవితంలో క్రీడలు భాగం కావాలి'
author img

By

Published : Dec 15, 2020, 2:47 PM IST

పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని కొనసాగించడానికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏటా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని మహబూబ్​నగర్​ ఎస్పీ రాజేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా పోలీస్​ హెడ్ క్వార్టర్స్ కవాతు మైదానంలో జిల్లా స్థాయి పోలీసు క్రీడలను ప్రారంభించారు. రెండు రోజులపాటు ఈ పోటీలను నిర్వహించనున్నారు.

ఈ పోటీల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొనే పోలీసులకు గుర్తింపు ఏర్పడుతుందని, ఇతరులకు ఆదర్శంగా ఉంటారని ఎస్పీ పేర్కొన్నారు. తొలిరోజు వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, బ్యాట్మింటన్ లాంటి ఆటలతో పాటు.. మహిళలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోలీసు వృత్తిలో శారీరక, మానసిక ఒత్తిడిని తొలగించుకునేందుకు ఆటలు, నడక, యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: భాజపా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.