మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాలు సహా దగ్గరలోని నియోజక వర్గ కేంద్రాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు పీఓ, ఏపీఓ సహా ఐదుగురు సిబ్బంది 10 నుంచి 20శాతం వరకూ అదనపు సిబ్బందిని మోహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4వేల మంది పోలింగ్ సిబ్బంది పనిచేయనున్నారు.
సిబ్బంది సామగ్రిని తీసుకొని సాయంత్రానికి కల్లా అధికారులు పోలింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. రవాణాకు అవసరమైన బస్సులను సిద్ధంగా ఉంచారు. ఓటింగ్ కేంద్రాల వద్ద మంచినీరు, మరుగుదొడ్లు, వృద్ధులు, వికలాంగుల కోసం వీల్ ఛైర్లు సిద్ధం చేస్తున్నారు. 63 పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్ రోస్ వెల్లడించారు.