ETV Bharat / state

ఆస్తుల నమోదులో ఎదురవుతోన్న ఇబ్బందులు

దసరా నాటికి ధరణి పోర్టల్​ను అధికారికంగా ప్రారంభించేందుకు.. సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆస్తుల నమోదు ప్రక్రియ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జోరుగా సాగుతోంది. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికే రంగంలోకి దిగిన సిబ్బంది సమాచారాన్ని సేకరించి, ఆన్ లైన్​లో నమోదు చేస్తున్నారు. కాని క్షేత్రస్థాయిలో తిరిగే సిబ్బందికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. సిబ్బంది అడిగే సమాచారాన్ని అందించేందుకు సరైన అవగాహన లేక జనం ముందుకు రావడం లేదు. ఆస్తుల నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులపై ఈటీవీ భారత్ క్షేత్రస్థాయి పరిశీలన కథనం.

ఆస్తుల నమోదులో ఎదురవుతోన్న ఇబ్బందులు
ఆస్తుల నమోదులో ఎదురవుతోన్న ఇబ్బందులు
author img

By

Published : Oct 2, 2020, 12:24 PM IST

మున్సిపాలిటీలు, గ్రామాల్లో అన్ని రకాల నిర్మాణ ఆస్తులను ఆన్ లైన్​లో నమోదు చేయాలన్న సర్కారు ఆదేశాల మేరకు ఆస్తుల నమోదు ప్రక్రియ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జోరందుకుంది. వివరాలను ఆన్ లైన్ నమోదు చేసేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది నానాతంటాలు పడుతున్నారు. మున్సిపాలిటీల్లోనైతే సుమారు 47 అంశాలపై సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు.

అన్ని ఉంటే 10 నిమిషాల్లోనే..

ఆస్తి యజమాని, వారి కుటుంబ సభ్యులు, ఆధార్ వివరాలు, ఆస్తి పన్ను, కరెంటు బిల్లు, మొబైల్ నంబర్, నిర్మాణం, దాని విస్తీర్ణం సహా 47 అంశాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. అన్ని సరిగ్గా ఉంటే సరి. 10 నిమిషాల్లో సర్వే ముగుస్తుంది. వీటిల్లో ఏ సమాచారం లేకపోయినా మళ్లీ ఆ ఇంటి వివరాలు మరుసటి రోజు సేకరించాల్సి వస్తోంది.

ఆస్తి యజమాని స్థానికంగా లేకపోవడం, సర్వే సమయంలో ఇంట్లో లేకపోవడం, నిరక్షరాస్యత, అవగాహన లేమితో సమాచారం ఇచ్చేందుకు కొందరు నిరాకరిస్తున్నారు. దీంతో ఒక్కో ఇంటికి 30 నుంచి 40 నిమిషాలు వెచ్చించాల్సి వస్తోంది. ఒక్కొక్కరు రోజుకు గరిష్టంగా 50 మంది వద్దే సమాచారం సేకరిస్తున్నారు. అలా చూస్తే ప్రతి మున్సిపాలిటీల్లో సమాచార సేకరణ, ఆన్ లైన్ నమోదు కోసం మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

పల్లెల్లో ఇబ్బందులు..

గ్రామ పంచాయతీల్లోనూ కార్యదర్శులు స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలమూరు జిల్లాలో వలస కుటుంబాలు అధికంగా ఉండటం వల్ల వారి ఆస్తుల సమాచార సేకరణ ఇబ్బందికరంగా మారింది. దాదాపు అన్ని వ్యవసాయ కుటుంబాలు కావడం వల్ల ఉదయం 10 గంటల తర్వాత ఇంటి యజమానులు అందుబాటులో ఉండటం లేదు.

అధికారుల్లో గందరగోళం..

ఇంటి యజమాని మృతి చెందిన నిర్మాణాలు, వివాదాల్లో ఉన్న ఆస్తుల నమోదు విషయంలో ఎవరి పేరు మీద నమోదు చేయాలన్న అంశంపై స్పష్టత కరవైంది. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు, ఇతర నిర్మాణాల నమోదులోనూ జనంలో, అధికారుల్లో గందరగోళం నెలకొంది. ఇందువల్ల సర్వే ఆలస్యమవుతోంది. దసరా లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

సర్వర్ సతాయింపులు..

నెట్​వర్క్, సర్వర్ సతాయింపులు ప్రధాన సమస్యగా మారాయి. ప్రస్తుతం ఆన్ లైన్ నమోదు కోసం మొబైల్ అప్లికేషన్ ని సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ఇంటి యజమాని ఫొటో తీసుకుని.. అన్ని వివరాలు మొబైల్ లో నమోదు చేయొచ్చు. రాసుకునే విధానంతో పోల్చితే సులువైనదే. కాని అన్ని చోట్ల నెట్​వర్క్ ఉంటేనే సవ్యంగా సాగుతుంది. నెట్​వర్క్ లేని చోట అప్లికేషన్ పనిచేస్తుందా లేదా అనుమానమే. అన్నిచోట్ల ఒకేసారి పనిచేయడం వల్ల సర్వర్ సైతం సహకరించడం లేదని పంచాయతీ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు.

సర్వర్, నెట్​వర్క్ సమస్యలు పరిష్కరిస్తేనే...

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 71 మండలాలు, 1,692 గ్రామపంచాయతీల్లో 29 లక్షల జనాభా ఉంది. వారికి సంబంధించి 6 లక్షల 90వేల ఆస్తులున్నాయి. 2 లక్షలకు పైగా ఆస్తులు తాజాగా ఆన్ లైన్ లో నమోదు చేశారు. సర్వర్, నెట్ వర్క్ సమస్యలను పరిష్కరించి స్పష్టత లేని అంశాలపై సరైన మార్గదర్శకాలు తీసుకురావాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: మహాత్ముడికి నివాళి అర్పించిన గవర్నర్ తమిళిసై​, సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.