మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో బుధవారం అధికారికంగా క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. మార్చి 21 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన నాటి నుంచి ఆగస్టు మొదటి వారం వరకు ఎలాంటి క్రయవిక్రయాలు నిర్వహించలేదు.
బుధవారం ఉల్లి, ఆముదం పంట విక్రయానికి రావడం వల్ల అధికారికంగా వ్యవసాయ మార్కెట్ పరిధిలో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. మార్కెట్ పరిధిలో పనిచేసే దడవాయి, చాట కూలీలు, హమాలీ, గుమస్తా, కమీషన్ ఏజెంట్లకు ఉపాధి లభించింది.