ETV Bharat / state

'ఇక ప్రజా ఉద్యమం చేయాల్సిందే'

సమ్మె విరమించి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మికులు విన్నవించినా... చేర్చుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
author img

By

Published : Nov 23, 2019, 8:56 AM IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉపయోగించుకుని ఆర్టీసీని కార్పొరేట్​ శక్తులకు శాశ్వతంగా అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ కుట్ర పన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. ఈ పరిస్థితి ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ప్రజా ఉద్యమం నిర్వహించాల్సిందేనని పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికులకు ఆశలు కల్పించి ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.

సమ్మె విరమించి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మికులు విన్నవించినా... చేర్చుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పడం దారుణమని మండిపడ్డారు.

Intro:TG_Mbnr_17_23_Tammineni_On_RTC_Private_Routes_AVB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) ఆర్టీసీ కార్మికుల పట్ల చూపించిన సానుభూతికి ఆశపడ్డారని... కానీ, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Body:రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆర్టీసీ కార్మికులకు అనేక ఆశలు కల్పించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కార్మికులది చట్టవిరుద్ధ సమ్మెగా ప్రకటించేందుకు నిరాకరించడం... ప్రభుత్వం చర్చలకు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడం... ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసినటువంటి అఫిడవిట్లపై చివాట్లు పెట్టడం... 5100 బస్సుల ప్రైవేటీకరణ నిర్ణయానికి స్టే ఇవ్వడం వంటి అంశాలు చూస్తే కార్మికులు ఆశపడ్డారు అని అన్నారు.

Conclusion:ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ఇటువంటి వైఖరి చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఐకాస కోరుతున్నా... కేసీఆర్ మాత్రం స్వచ్ఛందంగా చేరిన చేర్చుకునే పరిస్థితి లేదని చెప్పడం.... సమ్మె సందర్భాన్ని ఉపయోగించుకొని ఆర్టీసీ సంస్థలను కార్పొరేట్ శక్తులకు శాశ్వతంగా అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రపన్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ప్రజా ఉద్యమం నిర్వహించాల్సిందేనని.. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
బైట్
తమ్మినేనీ వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.