ETV Bharat / state

ఫలించిన చర్యలు.. తగ్గుముఖం పట్టిన కేసులు

అందుబాటులో కూరగాయలు, పండ్లు, నిత్యావసరాలు. సమస్యలు విన్నవించుకునేందుకు కమాండ్ కంట్రోల్ రూం.. వైద్య సహాయం, మందుల కోసం టెలీమెడిసిన్ సేవలు, కంటైన్మెంట్ జోన్లలో సంచార వాహనాలతో ఇళ్ల వద్దకే నిత్యావసరాలు. కట్టుదిట్టమైన నిఘా. కరోనా వ్యాప్తి చెందకుండా మహబూబ్​నగర్ జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలవి. ఫలితంగా ఐదారు రోజులుగా జిల్లాలో కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ప్రజల కోసం నేటి నుంచి ఎం3 ఫ్రెష్ పేరుతో టెలీబుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

corona situation in mahabubnagar
ఫలించిన చర్యలు.. తగ్గుముఖ పట్టిన కేసులు..
author img

By

Published : Apr 18, 2020, 12:28 PM IST

కరోనా వైరస్ నియంత్రణలో అహర్నిశలు శ్రమిస్తున్న మహబూబ్​నగర్ జిల్లా అధికార యంత్రాంగం.. లాక్​డౌన్​లో జనం ఇబ్బంది పడకుండా.. టెలీ విధానాలను అనుసరిస్తోంది. అందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమాండ్ కంట్రోల్ రూం, వైద్య సేవలు, మందుల కోసం టెలీమెడిసిన్ లాంటి కార్యక్రమాలను చేపట్టింది. ఫలితంగా కరోనా నియంత్రణలో విజయం దిశగా ప్రయాణిస్తోంది.

ఖర్చు వినియోగదారుడే భరించాలి

తాజాగా శనివారం నుంచి ఎం3 ఫ్రెష్ పేరుతో టెలీబుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మహబూబ్​నగర్ జిల్లా యంత్రాంగం, మెప్మా, ఎంసీఆర్​హెచ్​ఆర్​డీఐ ఆధ్వర్యంలో ఈ సేవల్ని ప్రారంభించనున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకూ 08542-252203 లేదా, 9553050607 నెంబర్లకు కాల్ చేస్తే.. ప్రజలకు కావాల్సిన పండ్లు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు నేరుగా ఇళ్ల వద్దకే డెలివరీ చేస్తారు. వాటికయ్యే ఖర్చు వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది.

ధాన్యం కొనుగోళ్ల సమస్యలు

మార్కెట్ రేటుకే ఈ సరుకులు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా.. లేదా ఏవైనా ఫిర్యాదులు చేయాలన్నా.. 08542-241165 నెంబర్​కు కాల్ చేయవచ్చు. ఇక రైతులు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం మహబూబ్‌నగర్‌ వ్యవసాయశాఖ కార్యాలయంలో 7288894333, 7288894390, 7288897898. నెంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

ఆన్​లైన్​లో శిక్షణ

ఉద్యోగులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు సమాయత్తం చేసేందుకు ఆధునిక సాంకేతికను మహబూబ్​నగర్ జిల్లా యంత్రాంగం వినియోగించుకుంటోంది. జిల్లాలోని 18 ప్రాంతాల నుంచి సుమారు 3వేల మందికి కొవిడ్-19 మార్గదర్శకాలపై ఆన్​లైన్​లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యులు, అంగన్​వాడీలు, ఆశ కార్యకర్తలు, మున్సిపల్, రెవిన్యూ, వైద్యారోగ్యశాఖ సహా ఇతరశాఖల సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షలు

మహబూబ్​నగర్​లో ఒకే ఒక్క రైతు బజారు ఉండగా.. లాక్ డౌన్ నేపథ్యంలో వాటిని ఆరు రైతుబజార్లుగా మార్చారు. కంటైన్మెంట్ జోన్లలో జోన్లను జనం రాకపోకలు నిలిపివేసి సంచార రైతు బజార్లు, పాలు, పండ్ల వాహనాలు ఏర్పాటు చేసి ఇళ్ల వద్దే సరకులు అందిస్తున్నారు. నిత్యావసర సరుకులు మార్కెట్ రేటుకు కావాల్సిన నిల్వలు అందుబాటులో ఉండేలా నిత్యం అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిత్యం క్రిమి సంహారక ద్రావణాల పిచికారి కొనసాగుతోంది. డ్రోన్ కెమెరాలో కంటైన్మెంట్ జోన్లలో పోలీసులు నిఘా పెట్టారు. భౌతిక దూరం పాటించకపోయినా, కారణం లేకుండా బయటకుకు వచ్చినా, ధరలు పెంచి అమ్మినా కేసులు నమోదవుతున్నాయి.

తగ్గిన కేసులు

అధికార యంత్రాంగం చేపట్టిన కట్టుదిట్టమైన చర్యల కారణంగా ఐదారు రోజులుగా కొత్త కేసులు నమోదు కావడం లేదు. జిల్లాలో మొత్తం 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు కోలుకున్నారు. జిల్లా నుంచి 281 మంది నమూనాలు కరోనా పరీక్షల కోసం పంపగా 272 మందికి కరోనా లేదని తేలింది. విదేశాల నుంచి వచ్చిన 327 మంది ఇప్పటికే హోం క్వారంటైన్ గడువు పూర్తి చేసుకున్నారు.

స్వచ్ఛందంగా పరీక్షలు

ప్రస్తుతం క్వారంటైన్​లో 597 మంది ఉన్నారు. ఒకరు జనరల్ ఆసుపత్రి ఐసోలేషన్​ పర్యవేక్షణలో ఉన్నారు. వీరిని ఎప్పటికప్పుడు వైద్యులు, అధికారులు కనిపెట్టుకుని ఉంటున్నారు. మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వాళ్లు ఇంకా ఎవరైనా ఉన్నా.. జలుబు, దగ్గు, జ్వరంతో కరోనా అనుమానిత లక్షణాలున్నా స్వచ్ఛందంగా పరీక్షలు నిర్వహించుకోవాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.