ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో 354, వనపర్తిలో 208, నాగర్‌కర్నూల్‌లో 191, జోగులాంబ గద్వాలలో 165, నారాయణపేటలో 98 మంది కరోనా బారినపడగా... మొత్తం ఉమ్మడి జిల్లాలో 1016 కేసులు నమోదయ్యాయి.
బుధవారం 51 కరోనా పాజిటీవ్ కేసులు నమోదవగా... ఒకరు మృతి చెందారు. వీరిలో ఒక పోలీసు, మరొక బ్యాంకు అధికారి ఉన్నారు. అత్యధికంగా వనపర్తి జిల్లాలో 27 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో 10 మందికి కొవిడ్-19 నిర్ధరణ అయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాజిటివ్ వచ్చిన వ్యక్తి మృతి చెందాడు. జోగులాంబ గద్వాల జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందరూ పట్టణానికి చెందిన వారే ఉన్నారు. నారాయణపేట జిల్లాలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... నాగర్‌కర్నూల్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఇదీ చూడండి: ఆసుపత్రుల్లో సాధారణ చికిత్సలు.. అగమ్యగోచరమే!