మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో కురిసిన భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ మార్కెట్లలో అమ్మేందుకు తీసుకొచ్చిన మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది. గిట్టుబాటు ధర వస్తుందని వ్యాపారులు చెప్పటం వల్ల రైతులు బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ఆరబెట్టారు. మార్కెట్లోని షెడ్లు నిండిపోవటం వల్ల కొందరు రైతులు ఆరుబయటే తమ దిగుబడిని నిలువ ఉంచారు. ఇంతలో ఒక్కసారిగా వచ్చిన వర్షంతో తమ ధాన్యమంతా తడిసి ముద్దైంది. వల్లూరు, తిమ్మాజిపేట తదితర గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరద నీటికి కొంత ధాన్యం కొట్టుకుపోగా... మిగిలినవాటిని కాపాడుకునేందుకు కర్షకులు నానా తంటాలు పడ్డారు.
ఇదీ చదవండి :ఓ తండ్రి నిర్వాకం...అమ్మకానికి ఆడ'పసికందు'