ETV Bharat / state

కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా ఉద్దాల ఉత్సవం

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన.. శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం శనివారం వైభవంగా జరిగింది. భక్తుల జనసందోహం మధ్య గోవింద నామస్మరణతో కురుమూర్తి కొండలు మారుమోగాయి. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా ఉద్దాల ఉత్సవం
కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా ఉద్దాల ఉత్సవం
author img

By

Published : Nov 21, 2020, 10:03 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్​లోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం ఘనంగా జరిగింది. శనివారం ఉదయం పలమర్రి గ్రామంలో.. ఉత్సవ ఊరేగింపు ప్రత్యేక వాహనంపై.. వడ్డెమాను గ్రామంలోని ఉద్దాల మంటపానికి చేరుకుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పోలీస్ బలగాల సమక్షంలో ఊరేగింపుగా ఊక చెట్టు వాగు గుండా ఉద్దాల మంటపం చేరుకుంది. మండపం దగ్గర ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ఊరేగింపుగా.. జాతర మైదానం చేరుకొని ప్రదక్షిణలు చేశారు.

స్వామివారి ఉద్దాలు ఏటా.. సాయంత్రం ఏడు గంటలకు చేరుకునేవి. అయితే కరోనా నిబంధన మధ్య ఈసారి మధ్యాహ్నం 3 గంటల వరకే మంటపాన్నిచేరుకున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఊహించిన దానికంటే అధికంగానే భక్తులు స్వామి ఉద్దాల దర్శనాన్ని తిలకించారని ఆల వెంకటేశ్వర్​ రెడ్డి తెలిపారు. కొవిడ్​ రెండో దశ ఉద్ధృతంగా ఉన్నందున గుంపులుగుంపులుగా కాకుండా.. ఒక్కొక్కరుగా నెమ్మదిగా వచ్చి నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే సూచించారు.

ఇదీ చదవండి: కురుమూర్తి బ్రహ్మోత్సవాల పొడిగింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.