ETV Bharat / state

'ప్రతి పంట కొనాలి... వెంటనే డబ్బులు చెల్లించాలి' - aicc secretary vamshichand reddy

మహబూబ్ నగర్ డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి నేతృత్వంలో రైతు సంక్షేమ దీక్ష నిర్వహించారు. రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేసి, డబ్బులు వెంటనే చెల్లించాలని వంశీచంద్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

'వారి ఖాతాల్లో ఇప్పటికీ నిధులు జమ కాలేదు'

author img

By

Published : May 6, 2020, 2:20 PM IST

కందులు కొనుగోలు చేసి 3-4 నెలలు గడిచినా.. ఇప్పటికీ డబ్బులు అందలేదని ఆయన గుర్తు చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు వారి ఖాతాల్లో ఇప్పటికీ నిధులు జమ కాలేదన్నారు. వారం రోజుల్లో డబ్బులు చెల్లించి ఉంటే ముక్కునేలకు రాస్తానంటూ ఆయన సవాలు విసిరారు. ఇక కొనుగోలు కేంద్రాల వద్ద గోనె సంచులు, టార్పాలిన్ల కొరతను అధిగమించాలని సూచించారు. రైతులకు మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎక్కడికక్కడే కాంగ్రెస్ రైతు దీక్ష

ఇక రైస్ మిల్లర్లను తరుగుపేరిట దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. తెరాస నేతలు, మిల్లర్లు కుమ్మక్కై ఈ దందాకు తెరతీశారన్నారు. కాంగ్రెస్ హయాంలో ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల పాత్రే ఉండేది కాదని.. ఇప్పుడు తరుగుపేరిట దోపిడి సాగుతోందని ఆగ్రహించారు. ప్రస్తుత సీజన్​లో కేవలం వరి మాత్రమే కాకుండా వచ్చే ప్రతి పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులు ఆదుకోవాలన్నారు. కరోనా లాక్​డౌన్ కారణంగా కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడే రైతు సంక్షేమ దీక్షను చేపట్టారు. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్​లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సైతం దీక్ష చేపట్టారు.

ఇవీ చూడండి : పెట్రో సుంకం పెంపుతో కేంద్రానికి ఇంత లాభమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.