ETV Bharat / state

'సమగ్ర సర్వే ఉండగా ధరణి సర్వే ఎందుకు' - మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేయాలంటూ మహబూబ్‌నగర్ పురపాలిక కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. పేద ప్రజలను దోచుకుని, రాష్ట్ర ఖాజానాను నింపుకుంటున్నారని విమర్శించారు.

Congress dharna on lrs in mahaboobnagar at muncipal office
'సమగ్ర సర్వే ఉండగా ధరణి సర్వే ఎందుకు'
author img

By

Published : Oct 12, 2020, 4:18 PM IST

కేవలం రాష్ట్రఖజానాను నింపేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని తీసుకువచ్చారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఎల్ఆర్ఎస్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ పురపాలక కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.

75 గజాల లోపు ఉన్న ప్లాట్లకు ఒక్క రూపాయికే ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇస్తామని పురపాలక చట్టంలో పెట్టిన కేసీఆర్ వేల రూపాయలు వసూలు చేస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి వెంకటేష్ విమర్శించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టిందని, ఇప్పుడు ధరణి సర్వే ఎందుకు చేపట్టారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాతో పేద ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకుని ఉంటే ఎల్ఆర్ఎస్ పేరుతో దోపిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇదీ చూడండి:ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్​ నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.