ETV Bharat / state

నడవని రైలు బండి.. బతుకు బండి నడిచేదేలా?

కొవిడ్ పుణ్యమాని పలు ప్యాసింజర్ రైళ్లు ఆగిపోయి ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా రైళ్లపై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లుతోంది. ఉపాధి కోసం నిత్యం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తక్కువ రవాణా ఖర్చులతో రైళ్లలో ప్రయాణం చేసేవారు. బస్సులున్నా.. ఛార్జీల భారం అధికమవుతోంది. అలా రైళ్లు నడవక.. భారంగా బతుకీడుస్తున్న ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా కూలీలు, కార్మికులు, ప్రయాణికుల కష్టాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

నడవని రైలు బండి... బతుకుబండి నడిచేదేలా?
నడవని రైలు బండి... బతుకుబండి నడిచేదేలా?
author img

By

Published : Feb 2, 2021, 4:45 PM IST

నడవని రైలు బండి... బతుకుబండి నడిచేదేలా?

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా గుండా వెళ్లే ప్రధాన రైలు మార్గం కాచిగూడ- కర్నూల్. మహబూబ్​నగర్ జిల్లా బాలనగర్ మొదలుకొని జోగులాంబ గద్వాల జిల్లా జోగులాంబ హాల్ట్ వరకు ఈ మార్గంలో 15 రైల్వే స్టేషన్లున్నాయి. లాక్​డౌన్​కు ముందు ఆ రైల్వేస్టేషన్లను తాకుతూ సుమారు 9 ఎక్స్​ప్రెస్ రైళ్లు, 18 ప్యాసింజర్ రైళ్లు నడిచేవి.

ఖర్చు తక్కువ...

ఉమ్మడి జిల్లాలో వివిధ గ్రామాల్లో నివసిస్తూ, హైదరాబాద్, మహబూబ్​నగర్, కర్నూల్ పట్టణాల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేసేవాళ్లు, రోజువారీ కూలీలు, చిరువ్యాపారాలు నడిపే వాళ్లు నిత్యం ఈ రైళ్లలోనే ప్రయాణించే వాళ్లు. అలాంటి వాళ్ల సంఖ్య సుమారు పదివేలకు పైగానే ఉంటుందని అంచనా. బస్సు, ఇతర రవాణా మార్గాలున్నా... రైలు ప్రయాణానికే వాళ్లు మొగ్గుచూపేవాళ్లు.

కారణం, రైలు ప్రయాణానికయ్యే ఖర్చు చాలా తక్కువ. మహబూబ్​నగర్ నుంచి హైదరబాద్​కు నిత్యం ప్రయాణించేందుకు సీజన్ టిక్కెట్టు తీసుకుంటే నెలకు రూ. 600 ఖర్చయ్యేవి. కానీ బస్సు మార్గంలో వెళ్తే నెలకు రూ. 6వేలు ఖర్చవుతాయి. అందుకే రైలే వారి జీవనోపాధికి వారధిగా మారింది. 10 నెలలుగా రైళ్లు ఆగిపోయాయి. వారి ఉపాధి కూలిపోయింది.

ఉద్యోగాలే వదిలేసి...

సొంత గ్రామాల నుంచి హైదరాబాద్​లాంటి పట్టణాలకు వెళ్లి పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు, రోజువారీ కూలీలంతా కనిష్టంగా నెలకు రూ. 10వేలు, గరిష్ఠంగా రూ. 20వేల వరకూ సంపాదిస్తూ ఉంటారు. నిత్యం రైలు ఛార్జీలు రూ. 1,000 పోను వేతనం మిగిలేది. రైళ్లు ఆగిపోవడం వల్ల ప్రయాణ ఖర్చులే రూ. 6వేలకు మించి పోయాయి. ఇతర ఖర్చులు పోనూ... వేతనంలో మిగిలేదేమీ లేక ఎంతోమంది ఉద్యోగాలే మానేశారు.

దుర్భర జీవితం...

చిరువ్యాపారాలు చేసే వాళ్లు దుకాణాలు మూసేశారు. కొవిడ్ నుంచి కోలుకుని సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా... కేవలం రైళ్లు నడవని కారణంగా తిరిగి పాత ఉద్యోగాల్లో చేరలేకపోతున్నారు. మూసేసిన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించలేకపోతున్నారు. వేలాది మంది ఉపాధి కోల్పోయి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.

ధర ఎక్కువ...

ప్రస్తుతానికి కొన్ని ఎక్స్​ప్రెస్ రైళ్లను పునరుద్ధరించినా... అవి కేవలం ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్లకే అందుబాటులో ఉన్నాయి. ప్యాసింజర్ రైళ్ల ధరతో పోల్చితే ఎక్స్​ప్రెస్ రైళ్ల ధర ఎక్కువ. ప్రధాన రైల్వేస్టేషన్లు మినహా ప్యాసింజర్ రైళ్లు ఆగే స్టేషన్లలో అవి ఆగవు. సీజన్ పాస్​లకు వాటిలో అనుమతి లేదు. ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణించడం లేదు.

100 నుంచి 120 మాత్రమే...

గతంలో 800లకు పైగా టిక్కెట్లు జారీ అయ్యే మహబూబ్​నగర్ రైల్వేస్టేషన్ నుంచి ప్రస్తుతం 100 నుంచి 120 వరకూ మాత్రమే రిజర్వేషన్లు నమోదమవుతున్నాయి. తిరిగి జీవనోపాధి దక్కాలంటే ప్యాసింజర్ రైళ్లను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. ఒక్కొక్కటిగా రైళ్లను పునరుద్ధరిస్తూ వస్తున్న కేంద్ర రైల్వేశాఖ ప్యాసింజర్ రైళ్లను ఎప్పుడు పునరుద్ధరిస్తుందా అని వేలాది మంది కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్ లేకుండా జనరల్ బుకింగ్​తో పాటు సీజన్ పాస్​లు అనుమతించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి: సినీ ఫక్కీలో స్కెచ్ వేశాడు.. భార్యను చంపించేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.