జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీలో కలెక్టర్ రొనాల్డ్ రాస్ పాల్గొన్నారు. పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారైతే వారిలో నైపుణ్యం అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో 1 నుంచి 19 వయసున్న వారందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎవరైన వేసుకొని యెడల 16వ తేదీన మరోసారి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 100% పూర్తి చేస్తామన్నారు.
జిల్లాలో 1185 అంగన్వాడీ కేంద్రాలలోని 43 వేల 353 మంది పిల్లలకు, 1240 పాఠశాలలోని 2 లక్షల మంది విద్యార్థులు, 30 జూనియర్ కళాశాలలో 25 వేల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు విద్యాశాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ రోజు విద్యార్థులందరికీ మాత్రలు వేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
ఇదీ చూడండి : పరిమితికి మించి వాహనాల్లో ఎక్కిస్తే ఇక అంతే