మహబూబ్‌నగర్‌లోని బాలికల జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రానికి వెళ్లడానికి కంటే ముందు చరవాణులు తీసుకునేందుకు ఓ కౌంటర్ ఏర్పాటు చేశారు. బూత్ లోపలికి చరవాణుల అనుమతి లేదని చెబుతూ వారి వద్ద ఉంచుకున్నారు. ఓటేసి తిరిగి వెళ్లేటప్పుడు సెల్ ఫోన్ భద్రపరిచినందుకు గాను పది రూపాయలు వసూలు చేశారు.
పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు వచ్చిన రిటర్నింగ్ అధికారి సీతారామారావు దృష్టికి తీసుకువెళ్లగా... వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ గదిలోకి వెళ్లే ముందు సెల్‌ఫోన్ అధికారులకు అప్పగించి... వెళ్లేటప్పుడు తీసుకువెళ్లాలని సూచించారు.
ఇదీ చూడండి: భాజపా ఆట మొదలెడితే తెరాసకు దిమ్మతిరుగుద్ది : కిషన్ రెడ్డి