ETV Bharat / state

కేసీఆర్‌... నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ప్రధాని మోదీయే అన్నారు: సీఎం - Mahbubnagar district latest news

CM KCR tour in Mahabubnagar district
CM KCR tour in Mahabubnagar district
author img

By

Published : Dec 4, 2022, 12:15 PM IST

Updated : Dec 4, 2022, 5:19 PM IST

17:17 December 04

పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం: సీఎం

  • పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం: సీఎం
  • సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తాం
  • ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం పథకాన్ని 15 రోజుల్లో ప్రారంభిస్తాం
  • ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మందికి ఇంటి కోసం నిధులు ఇస్తాం
  • గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం: సీఎం కేసీఆర్‌
  • నేను మీతో ఉంటా...మీరు నాతో ఉండాలి, కలిసి అభివృద్ధి చేసుకుందాం: సీఎం
  • మీరు హామీ ఇస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాం: సీఎం
  • తెలంగాణ వలే భారత్‌ను కూడా అభివృద్ధి చేసుకుందాం: సీఎం
  • తెలంగాణ ప్రజలు జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలి

17:05 December 04

ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో పరిస్థితి ఎలా ఉందో చూడండి: సీఎం కేసీఆర్

  • రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్‌ రాజకీయాల కోసం కాదు: సీఎం
  • తెలంగాణ రైతు దేశంలోనే గర్వంగా తలెత్తుకుని నిలబడాలని భావించాం: సీఎం
  • దేశ రాజధాని దిల్లీలోనే కరెంట్‌ కోతలు వేధిస్తున్నాయి: సీఎం
  • ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో పరిస్థితి ఎలా ఉందో చూడండి
  • కర్ణాటక, మహారాష్ట్రలో పరిస్థితి, తెలంగాణ పరిస్థితిని పోల్చి చూడండి: సీఎం
  • బాగుపడుతున్న రాష్ట్రానికి అడ్డుపడటం కేంద్రం చేయదగిన పనేనా?
  • ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా?: సీఎం
  • కేసీఆర్‌... నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ప్రధాని మోదీయే అన్నారు: సీఎం
  • బంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారని మోదీ చెప్పారు
  • ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్య విధానమా?
  • ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్మడం అభివృద్ధి అవుతుందా?
  • తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నలుగురు దొంగలు వచ్చారు
  • నలుగురు దొంగలను పట్టుకుని జైలులో వేశాం: సీఎం కేసీఆర్‌

17:01 December 04

రాష్ట్రానికి భాజపా నేతలు ఏమీ చేయరు, చేసే వారి కాళ్లల్లో కట్టెలు పెడతారు: సీఎం కేసీఆర్

  • మోదీ సర్కారు వల్ల తెలంగాణ రూ.3 లక్షల కోట్లు కోల్పోయింది: సీఎం
  • కేంద్రప్రభుత్వం సహకరించి ఉంటే తెలంగాణ జీఎస్‌డీపీ ఇంకా పెరిగి ఉండేది
  • కృష్ణా జలాల్లో వాటా తేల్చేందుకు మోదీకి 8 ఏళ్లు కూడా సరిపోలేదా?
  • వాటా తేల్చేందుకే 8 ఏళ్లు సరిపోకపోతే అనుమతులు ఇచ్చేది ఎప్పుడు?
  • రాష్ట్రానికి భాజపా నేతలు ఏమీ చేయరు, చేసే వారి కాళ్లల్లో కట్టెలు పెడతారు
  • దేశంలో ఏం జరుగుతుందో యువత, మేధావులు, చదువుకున్నవాళ్లు ఆలోచన చేయాలి

16:53 December 04

మహబూబ్‌నగర్‌కు క్రీడా మైదానం, ఆడిటోరియం మంజూరు చేస్తాం: సీఎం

  • మహబూబ్‌నగర్‌కు క్రీడా మైదానం, ఆడిటోరియం మంజూరు చేస్తాం: సీఎం
  • ప్రతి వర్గానికి ఒక కార్యక్రమం చేపట్టి ఆదుకుంటున్నాం: సీఎం
  • తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా బాగుపడుతుందని 20 ఏళ్ల క్రితమే చెప్పాను
  • కర్ణాటక, మహారాష్ట్రలో సరిహద్దుల్లోని ప్రజలు తెలంగాణలో కలపాలని కోరుతున్నారు
  • గతంలో రూ.50 వేలు ఇచ్చే ఆపద్బంధు కోసం కాళ్లు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేది
  • ఇప్పుడు రైతు ఏ కారణంతో చనిపోయినా.. రైతుబీమా కింద రూ.5 లక్షలు వస్తున్నాయి
  • మహబూబ్‌నగర్‌ జిల్లాకు వైద్య కళాశాలలు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నామా?
  • రాత్రింబవళ్లు కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం ఇంత ప్రగతి సాధించింది
  • మేధావులు, చదువుకున్న యువత సరిగా ఆలోచించాలి

16:46 December 04

పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ సాధించడం గర్వకారణం: సీఎం కేసీఆర్‌

  • మహబూబ్‌నగర్‌లో అద్భుతమైన కలెక్టరేట్‌ను నిర్మించుకున్నాం: సీఎం
  • పాలనా సంస్కరణల్లో భాగంగా 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుని కలెక్టరేట్‌లు నిర్మించుకుంటున్నాం
  • పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ సాధించడం గర్వకారణం: సీఎం కేసీఆర్‌
  • ఒకప్పుడు పాలమూరు జిల్లాలో ఎక్కడ చూసినా కరువు, ఆకలికేకలు: సీఎం
  • ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నాం
  • వలసలతో వలవలపించేను పాలమూరు అనే పాట ఉండేది: సీఎం
  • సమైక్య పాలకులు మనల్ని నిరాదరణకు గురి చేశారు: సీఎం
  • ఇప్పుడు పాలమూరు అంటే పచ్చబడిన జిల్లా అంటున్నారు: సీఎం
  • పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్కటే పూర్తి కావాల్సి ఉంది
  • పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం సహకరించటం లేదు
  • కృష్ణా జలాల్లో మన వాటా తేల్చమంటే కేంద్రం తేల్చటం లేదు
  • సంక్షేమంలో ఇప్పుడు మనకు ఎవరూ సాటి లేదు: సీఎం కేసీఆర్‌
  • మహబూబ్‌నగర్‌ జిల్లా ఇప్పుడు ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుతోంది
  • ఇరుకైన రోడ్లు విశాలంగా మారి మహబూబ్‌నగర్ అందంగా కనిపిస్తోంది

16:45 December 04

మన నాయకుడిని ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

  • కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • పాలమూరు జిల్లాలో నేడు చెరువులు నిండుకుండలా ఉన్నాయి: శ్రీనివాస్‌గౌడ్‌
  • కృష్ణా జలాలు ఏపీకి పోతుంటే ఇక్కడి నేతలు హారతులు పట్టారు: శ్రీనివాస్‌ గౌడ్‌
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కేంద్రం ఎందుకు మాట్లాడదు
  • మన కోసం కష్టపడే సీఎం కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోంది
  • కులమతాల పేరుతో చిచ్చు పెట్టడం తప్ప.. భాజపా ప్రజలకు చేసిందేమీ లేదు
  • మన నాయకుడిని ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
  • రాష్ట్రాన్ని తీర్చిదిద్దినట్లే దేశాన్ని మార్చాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు

14:52 December 04

ఏ తెలంగాణ కోరుకున్నామో అది సాకారమవుతోంది: సీఎం

  • ఏ తెలంగాణ కోరుకున్నామో అది సాకారమవుతోంది: సీఎం
  • అద్భుతమైన ప్రయాణంలో మనం సాగుతున్నాం: సీఎం కేసీఆర్‌
  • ఇది సాధించామనే సంతృప్తి జీవితంలో చాలా ముఖ్యం: కేసీఆర్‌
  • ఒకప్పుడు పీవీ నర్సింహారావు ఏర్పాటు చేసిన సర్వేల్‌ గురుకుల పాఠశాల అందరికీ గర్వకారణం
  • అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం
  • ఒక చిన్న గ్రామంలో 127 మందిలో కంటిచూపు సమస్య ఉంది
  • కంటి వెలుగు పథకం వెనక ఎంతో పరమార్థం ఉంది: సీఎం కేసీఆర్
  • అధికారులు అంకితభావంతో కంటివెలుగును విజయవంతం చేయాలి
  • ఏ పథకం తెచ్చినా.. సమగ్ర చర్చ, ఒక దృక్పథం ఉంటుంది
  • మహిళలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆర్థిక, సామాజిక సమస్యలు ఉంటాయి
  • కేసీఆర్‌ కిట్‌ పథకం కూడా ఆషామాషీగా తెచ్చింది కాదు: సీఎం
  • గర్భిణీగా ఉన్నప్పుడు ఆదాయం కోల్పోతారనే డబ్బు కూడా ఇస్తున్నాం
  • టీకాలను నిర్లక్ష్యం చేయొద్దనే టీకాలు వేయించినప్పుడు డబ్బులు ఇస్తున్నాం
  • సామాజిక, మానవీయ దృక్పథంతో పథకాలు తెస్తున్నాం: సీఎం
  • సంస్కరణలు నిరంతర ప్రక్రియ, ఒక దశతో ముగిసేవి కావు: సీఎం
  • మన రాష్ట్రం చిమ్మచీకటవుతుందని శపించిన వాళ్లూ ఉన్నారు: సీఎం
  • అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అద్భుతప్రగతి సాధిస్తున్నాం: సీఎం
  • ఈ 8 ఏళ్లలో అందించిన సహకారం భవిష్యత్‌లోనూ కొనసాగాలి: సీఎం

14:21 December 04

మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

  • మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • నూతన కలెక్టరేట్ భవనంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్‌

13:41 December 04

మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

  • మహబూబ్‌నగర్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన
  • మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌
  • నూతన పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన కేసీఆర్
  • టీఆర్ఎస్ కార్యాలయంలో పూజలు నిర్వహించిన కేసీఆర్‌

13:39 December 04

సీఎం కాన్వాయి వెళ్తుండగా జడ్చర్లలో బీజేవైఎం సభ్యుల నిరసన

  • కాసేపట్లో మహబూబ్‌నగర్‌లో టీఆర్​ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించనున్న కేసీఆర్‌
  • సీఎం కాన్వాయి వెళ్తుండగా జడ్చర్లలో బీజేవైఎం సభ్యుల నిరసన
  • నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

13:05 December 04

కాసేపట్లో మహబూబ్​నగర్ చేరుకోనున్న సీఎం కేసీఆర్

  • కాసేపట్లో మహబూబ్​నగర్ చేరుకోనున్న సీఎం కేసీఆర్

11:11 December 04

ప్రగతిభవన్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు బయల్దేరిన సీఎం కేసీఆర్‌

  • ప్రగతిభవన్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు బయల్దేరిన సీఎం కేసీఆర్‌
  • రోడ్డు మార్గంలో మహబూబ్‌నగర్‌కు బయల్దేరిన సీఎం కేసీఆర్‌
  • మ.12.45 గం.కు మహబూబ్‌నగర్‌లో తెరాస పార్టీ కార్యాలయం ప్రారంభించనున్న కేసీఆర్‌
  • మ.1.30 గంటలకు జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం
  • సా.4 గం.కు ఎంవీఎస్ కళాశాల మైదానంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం
  • సా.5 గం.కు హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్
  • సీఎం పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

Last Updated : Dec 4, 2022, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.