ETV Bharat / state

బీజేపీ నేతలు ఏమీ చేయరు.. చేసే వారికి అడ్డొస్తారు: సీఎం కేసీఆర్ - కేసీఆర్ తాజా వ్యాఖ్యలు

CM KCR Speech in Mahabubnagar: తెలంగాణాభివృద్ధికి కేంద్రం సహకరించట్లేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సర్కారు వల్ల తెలంగాణ రూ.3 లక్షల కోట్లు కోల్పోయిందని అన్నారు. కృష్ణాజలాల్లో కేంద్రం రాష్ట్ర వాటా తేల్చడంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రానికి బీజేపీ నేతలు ఏమీ చేయరు.. చేసే వారికి అడ్డొస్తారని ఆరోపించారు. కేసీఆర్‌.. మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ప్రధానే అన్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర సర్కార్ తీరు 'పైనపటారం- లోనలొటారమని' ఎద్దేవా చేశారు.

CM KCR
CM KCR
author img

By

Published : Dec 4, 2022, 5:50 PM IST

Updated : Dec 4, 2022, 6:55 PM IST

CM KCR Speech in Mahabubnagar: మహబూబ్​నగర్​లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. మోదీ సర్కారు వల్ల తెలంగాణ రూ.3 లక్షల కోట్లు కోల్పోయిందని ముఖ్యమంతి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రానికి బీజేపీ నేతలు ఏమీ చేయరు.. చేసే వారికి అడ్డొస్తారని ఆరోపించారు. కేసీఆర్‌.. మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ప్రధానే అన్నారని వ్యాఖ్యానించారు. కృష్ణాజలాల్లో కేంద్రం రాష్ట్ర వాటా తేల్చడంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు

నలుగురు దొంగలను పట్టుకుని జైల్లో వేశాం.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్య విధానమా అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర కేంద్రంలోని పెద్దలు చేస్తున్నారని ఆరోపించారు. సర్కార్‌ను పడగొట్టేందుకు వచ్చిన నలుగురు దొంగలను పట్టుకుని జైల్లో వేశామన్న సీఎం ఇదేనా ప్రజాస్వామ్యమం అని ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిద్దామని పాలమూరు ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో ముందుకెళ్తామన్నారు.

బీజేపీ నేతలు ఏమీ చేయరు.. చేసే వారికి అడ్డొస్తారు: సీఎం కేసీఆర్

'సమైక్య పాలకులు మనల్ని నిరాదరణకు గురి చేశారు. వలసలతో వలవలపించేను పాలమూరు అనే పాట ఉండేది. కానీ, ఇప్పుడు పాలమూరు అంటే పచ్చబడ్డ జిల్లా అంటున్నారు. పోరాటాలు చేసిన సాధించుకున్న తెలంగాణలో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నాం. మహబూబ్‌నగర్‌ జిల్లా ఇప్పుడు ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుతోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్కటే పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించటం లేదు. సంక్షేమంలో మనకు ఎవరూ సాటి లేరు.. పోటీ లేరు. ప్రతి వర్గానికి ఒక కార్యక్రమం చేపట్టి ఆదుకుంటున్నాం. మహబూబ్‌నగర్‌కు క్రీడా మైదానం, ఆడిటోరియం మంజూరు చేస్తాం. తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా బాగుపడుతుందని 20 ఏళ్ల క్రితమే చెప్పాను.'-కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం పథకాన్ని త్వరలో ప్రారంభిస్తాం.. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజలు తెలంగాణలో కలపాలని కోరుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో రూ.50వేలు ఇచ్చే ఆపద్బంధు కోసం కాళ్లు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదన్న సీఎం.. కానీ, ఇప్పుడు రైతు ఏ కారణంతో చనిపోయినా.. రైతు బీమా కింద రూ.5లక్షలు వస్తున్నాయన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు వైద్య కళాశాలలు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నామా ప్రశ్నించారు. రాత్రింబవళ్లు కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం ఇంత ప్రగతి సాధించిందని తెలిపారు. మేధావులు, చదువుకున్న యువత సరిగా ఆలోచించాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు రూ.3లక్షల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు చొప్పున త్వరలోనే మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

సర్కార్ తీరు వల్ల రాష్ట్ర రూ.3లక్షల కోట్లు నష్టపోయింది.. మోదీ సర్కారు వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే తెలంగాణ జీఎస్‌డీపీ ఇంకా పెరిగి ఉండేదని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చేందుకు మోదీకి ఎనిమిదేళ్లు కూడా సరిపోలేదా అని ప్రశ్నించారు. వాటా తేల్చేందుకు 8 ఏళ్లు సరిపోకపోతే అనుమతులు ఇచ్చేది ఎప్పుడు అని నిలదీశారు. ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఏం జరుగుతుందో గ్రామాల్లో చర్చ జరగాలన్న ఆయన.. ప్రజలు, మేధావులు, యువత ఆలోచించాలన్నారు. ఐదేళ్లలో మిషన్‌ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పానన్న సీఎం.. ఆవిధంగానే చేసి చూపించామన్నారు.

'రాష్ట్రానికి భాజపా నేతలు ఏమీ చేయరు, చేసే వారి కాళ్లలో కట్టెలు పెడతారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు రాజకీయాల కోసం కాదు. తెలంగాణ రైతు దేశంలోనే గర్వంగా తలెత్తుకుని నిలబడాలని భావించాం. కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసీఆర్‌ .. నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని ప్రధాని మోదీయే అన్నారు. వెల్లడించారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా? బంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారని మోదీ చెప్పారు.'-సీఎం కేసీఆర్

ఇవీ చదవండి:

Last Updated : Dec 4, 2022, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.