మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం కేతిరెడ్డి గ్రామం ఎర్ర కుంట తండాకు చెందిన శంకర్ నాయక్ తన కుమారుడిని పాఠశాలకు తీసుకెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పెద్దపల్లి సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకర్ నాయక్‌కు, అతని కొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శంకర్ నాయక్ మృతి చెందాడు. ఆయన కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు... ఒకరు మృతి - car bike accident
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో తండ్రి మృతి చెందగా... కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్న సంఘటన బాలనగర్ మండలం పెద్దపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.