మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయినపల్లి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలానికి చెందిన జీవన్‌కుమార్... భార్య ప్రియా, 16 నెలల కూతురు ఆర్యతో కలిసి శుభకార్యానికి వెళ్లి కారులో వస్తున్నారు. జడ్చర్ల- కల్వకుర్తి ప్రధాన రహదారిపై బోయినపల్లి గ్రామం సమీపంలో మలుపు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో చిన్నారి ఆర్య అక్కడికక్కడే మృతిచెందింది. జీవన్, ప్రియా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రహదారిపై గుంత ఉండటం వల్లే కారు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : 40 ప్రేమ కథల 'కడలి'