ETV Bharat / state

BRS నేతల అత్యుత్సాహం.. మంత్రి ముందే వ్యక్తిపై దాడి.. ఎందుకంటే? - Minister Srinivas Goud latest news

మహబూబ్​నగర్ జిల్లాలోని జిల్లా పరిషత్ మైదానంలో ఏర్పాటు చేసిన దసరా వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎదుట ఓ వ్యక్తిపై బీఆర్​ఎస్​ నేతలు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, వారిని అడ్డుకోకపోవడంపై పలు విమర్శలు వెలువెత్తాయి.

మహబూబ్​నగర్ జిల్లా
మహబూబ్​నగర్ జిల్లా
author img

By

Published : Oct 6, 2022, 9:58 PM IST

Updated : Oct 6, 2022, 10:41 PM IST

మహబూబ్​నగర్ జిల్లాలోని జిల్లా పరిషత్ మైదానంలో ఏర్పాటు చేసిన దసరా వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎదుట ఓ వ్యక్తిపై బీఆర్​ఎస్​ నేతలుదాడి చేశారు. అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, వారిని అడ్డుకోకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి.

జిల్లా పరిషత్ మైదానంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో చివరగా బాణసంచా కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగిస్తుండగానే బాణసంచా కాల్చడం మొదలుపెట్టారు. దీంతో మంత్రి దసరా ఉత్సవ కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభ నిర్వహకులు బాణసంచా నిర్వాహకుడిని హెచ్చరిస్తూ వేదికపైకి రావాలని తెలిపారు. దీంతో బాణసంచా నిర్వాహకుడు హరనాథ్ వేదికపైకి రాగానే బీఆర్​ఎస్​ నాయకులు అతనిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఉన్నతాధికారులు ఈ దాడి గురించి పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. వెంటనే కొందరు పోలీసులు బీఆర్​ఎస్​ నేతలకు సర్దిచెప్పి హరనాథ్​ను పక్కకు తప్పించడంతో గొడవ సద్దుమణిగింది.

అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్న సమయంలోనే వర్షం చినుకులు పడడంతో పాటు.. నిర్వాహకుల సమన్వయ లోపం కారణంగా బాణసంచా కాల్చడం గందరగోళానికి దారితీసింది.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎదుట ఓ వ్యక్తిపై బీఆర్​ఎస్​ నేతల దాడి

ఇవీ చదవండి: త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న దళిత సోదరులతో దళిత్ సదస్సు: కేసీఆర్‌

చెరువులో గేదె దిగిందని.. మహిళను నీటిలో ముంచి.. విచక్షణారహితంగా..

Last Updated : Oct 6, 2022, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.