BRS Aiming for Hattrick Win in Telangana : 2023 శాసనసభ ఎన్నికల్లో(Telangana Assembly Election 2023) గులాబీ పార్టీ విజయం సాధిస్తే దక్షిణాదిన వరుసగా అధికారం దక్కించుకున్న పార్టీగా బీఆర్ఎస్, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్(KCR will Hattrick Win) రికార్డుతో చరిత్ర సృష్టిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ పలువురు రాజకీయ నాయకులు మూడోసారి ముచ్చటైన విజయం కోసం తహతహలాడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో 3సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ వరుసగా 3సార్లు విజయం దక్కించుకున్న వాళ్లు మాత్రం కొంతమందే.
Mahabubanagar MLAs Aiming for Hattrick : అలాంటి వరుస విజయాలు అందుకున్న వారిలో కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు వరుసగా 5సార్లు విజయం సాధించారు. అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్ధి కొత్త వెంకటేశ్వరరావు సైతం హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి నాగంజనార్ధన్ రెడ్డి వరుసగా 4సార్లు గెలిచారు. గద్వాల నియోజక వర్గం నుంచి డీకే అరుణ మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారు. కల్వకుర్తి నుంచి మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి సైతం ఎమ్మెల్యేగా 3 విజయాలు అందుకున్నారు. ఇలాంటి వరుస విజయాల కోసం ప్రస్తుత అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా పోటీపడుతున్నారు.
8 Mahbubnagar MLAs Trying For Hattrick : నియోజక వర్గాల వారీగా చూస్తే మహబూబ్ నగర్ నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ గెలిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డుల్లో నిలవనున్నారు. గతంలో మాజీమంత్రి చంద్రశేఖర్ రెండుసార్లు గెలిచినా, వరుసగా మూడోవిజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. జడ్చర్లలోనూ మాజీమంత్రి లక్ష్మారెడ్డి ఈసారి విజయం సాధిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలుస్తారు. నర్సప్ప, కృష్ణారెడ్డి వరుసగా రెండుసార్లు విజయం సాధించినా.. మూడోసారి ఆ అదృష్టం దక్కలేదు. దేవరకద్ర నుంచి 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఆల వెంకటేశ్వర రెడ్డి సైతం మూడోసారి ఎమ్మెల్యే కావాలని శ్రమిస్తున్నారు.
Telangana Assembly Election 2023 : మక్తల్‌లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్ రెడ్డి మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మక్తల్‌లో చిట్టెం నర్సిరెడ్డి, ఎల్లారెడ్డి వరుసగా రెండు పర్యాయాలు గెలిచినా, మూడోసారి అవకాశాన్ని జనం ఇవ్వలేదు. నాగర్ కర్నూల్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన మర్రి జనార్ధన్ రెడ్డి మరోసారి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. అచ్చంపేటలో మహేంద్రనాథ్, పి.రాములు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. వరుసగా 3విజయాలు అందుకోలేకపోయారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అచ్చంపేట ప్రజలు హ్యాట్రిక్ విజయం అందిస్తారో లేదో? వేచిచూడాల్సిందే.
Mahbubnagar Politics 2023 : షాద్‌నగర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన మాజీ మంత్రి శంకర్ రావుకు సైతం హాట్రిక్ విజయం దక్కలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఈ ఎన్నికల్లో ఆ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వనపర్తిలో బాలకృష్టయ్య, చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు రెండుసార్లు ఎమ్మెల్యేలు అయ్యారు కానీ వరుసగా హ్యాట్రిక్ విజయాల్ని ప్రజలు కట్టబెట్టలేదు. అలంపూర్‌లోనూ బీజేపీ అభ్యర్థి రావుల రవీంద్రనాథ్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ వరుసగా కాలేదు. కొడంగల్‌లో గురునాథ్ రెడ్డి, నందారం వెంకటయ్య పలుమార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా హ్యాట్రిక్ విజయం మాత్రం దక్కలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరుసగా రెండుసార్లు కొడంగల్‌లో గెలిచినా.. మూడోసారి మాత్రం ఓటమే ఎదురైంది.
Minister KTR Comments on BJP : "రాష్ట్రంలో ఏ మూల తిరిగినా.. ప్రజల విశ్వాసం కేసీఆరే"