మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో సుప్రభాత సేవతో ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 16 వరకు వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రానున్నారు. ఆలయ ధర్మకర్తలు, ప్రభుత్వ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు ప్రారంభమైన ఉత్సవాలు వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వరకు కొనసాగునున్నాయి. ఆదివారం రథోత్సవం సోమవారం శకట ఉత్సవం, గరుడ వాహన సేవ, గజవాహన సేవ, శేష వాహన సేవతో కార్యక్రమాలు ముగియనున్నాయి.
ఇదీ చూడండి : శరీరంపై పెయింటింగ్ వేసుకుని ప్రచారం