మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ముందుగా పట్టణంలో పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎగ్గని నర్సింలు.. ఎల్ఆర్ఎస్ విధానంలో ఉన్న లోపాలను వివరిస్తూ ప్రభుత్వ తీరును విమర్శించారు. ఈ నిరసన ర్యాలీలో స్థానిక నాయకులు యజ్ఞ భూపాల్ రెడ్డి, అంజన్ కుమార్ రెడ్డి, నారాయణ రెడ్డి రాజు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష