ETV Bharat / state

సీఏఏ, ఎన్​పీఆర్​పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ఎమ్మెల్సీ రామచందర్​రావు - సీఏఏ, ఎన్​పీఆర్​పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ఎమ్మెల్సీ రామచందర్​రావు

జాతీయ పౌరపట్టిక, పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని ఎమ్మెల్సీ రామచందర్​రావు ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో భాజపాకు అండగా నిలవాలని కోరారు.

mlc ramchandar rao
సీఏఏ, ఎన్​పీఆర్​పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ఎమ్మెల్సీ రామచందర్​రావు
author img

By

Published : Jan 3, 2020, 9:47 PM IST

జాతీయ పౌరపట్టిక, పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్, మజ్లిస్ సహా కొన్ని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని భాజపా నేత, ఎమ్మెల్సీ రామచందర్​రావు ఆరోపించారు. జాతీయ పౌర పట్టిక భాజపా తీసుకొచ్చింది కాదన్నారు. మహబూబ్​నగర్​ భాజపా కార్యాలయంలో కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. సీఏఏ ఏ మతాన్నో.. వర్గాన్నో ఉద్దేశించి తీసుకువచ్చింది కాదని స్పష్టం చేశారు.

సీఏఏ, ఎన్​పీఆర్​పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ఎమ్మెల్సీ రామచందర్​రావు

ప్రతిపక్షాలు, వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి సంఘాలు మాత్రమే తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కొన్ని వర్గాల వారిని దేశం నుంచి పంపించివేస్తారంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ తెరాసను కూడా మభ్యపెట్టిందన్నారు. పురపాలక ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్​కు వేసే ప్రతి ఓటు మజ్లిస్​కు వేసినట్లేనని తెలిపారు.

ఇవీచూడండి: 'పౌర' చట్టం అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: షా

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.