మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ఆందోళన నిర్వహించారు. వరుసగా కురుస్తోన్న వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో దినదిన గండంగా గడుపుతున్నవారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తక్షణం స్పందించి, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని కోరారు. తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. బాధితులతో పాటు భాజపా జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు నంబి రాజు, కురువ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.